సీఎం స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి సమక్షంలో విజయనగరం జిల్లా రాజాంకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, ఆయన తనయుడు డాక్టర్‌ తలే రాజేష్ వైయ‌స్‌ఆర్ సీపీలో చేరారు. ఈ మేర‌కు వారికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పార్టీ కండువాలు క‌ప్పి వైయ‌స్ఆర్ సీపీలోకి ఆహ్వానించారు. పాలకొండ నియోజకవర్గం నుంచి టీడీపీ త‌ర‌ఫున‌ రెండు సార్లు గెలుపొందిన తలే భద్రయ్య (1985, 1994), ఏపీపీఎస్సీ సభ్యుడిగా ఆరేళ్ల‌ పాటు ప‌నిచేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, విజయనగరం జిల్లా వైయ‌స్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top