మంతెన అనంత వ‌ర్మ వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరిన టీడీపీ నేత‌లు‌

తాడేప‌ల్లి: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మంతెన అనంత వ‌ర్మ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన మంతెన అనంత‌ వ‌ర్మ‌.. సీఎం స‌మక్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. అనంత వ‌ర్మ‌తో పాటు టీడీపీ నేతలు మంతెన సుబ్బరాజు, వి. వెంకటేశ్వరరాజు, ఎం.వి. సర్వేశ్వర యాదవ్, పృద్వీరాజు, మంతెన నాగరాజు, బాపూజీ, మోదుగుల వెంకటరెడ్డి వైయ‌స్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు.  కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఉన్నారు. 

Back to Top