తాడేపల్లి: టీడీపీ మాజీ మంత్రి ఈవూరి సీతారావమ్మ, మాజీ ఎమ్మెల్యే ఈవూరి సుబ్బారావుల తనయుడు ఈవూరి గణేష్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో రేపల్లె నియోజకవర్గానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ఈవూరి గణేష్, డాక్టర్ ఈవూరి కేశవతి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కూచినపూడి నియోజకవర్గం నుంచి 1985, 1989, 1994లో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేసిన ఈవూరి సీతారావమ్మ బీసీ గౌడ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ ఈవూరి గణేష్ 2009లో పీఆర్పీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా రేపల్లె నుంచి పోటీ. ఈ కార్యక్రమంలో ఎంపీ మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు.