ప్ర‌తీ గ‌డ‌ప‌కూ సంక్షేమ సాయం అందుతోంది

కొత్త‌కోట‌లో గడప గడపకు మ‌న ప్ర‌భుత్వం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి

ఉరవకొండ: వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు అర్హ‌త ఉన్న ప్ర‌తీ ఒక్క‌రికీ అందుతున్నాయ‌ని, లంచం, వివ‌క్షకు తావులేకుండా ప్ర‌తీ గ‌డ‌పకూ చేరుతున్నాయ‌ని ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్ సీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి అన్నారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని విడ‌ప‌న‌క‌ల్లు మండ‌లం కొత్త‌కోట గ్రామంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గ్రామంలోని ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా అమ‌లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. బుక్‌లెట్‌లు పంపిణీ చేశారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు చెప్పిన సమస్యల పరిష్కారానికి త‌క్ష‌ణ చర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. కార్యక్రమంలో వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. 

Back to Top