తాడిపత్రి లో నిరంకుశ పాలన 

మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి 

అనంతపురం: చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతో తాడిపత్రి లో నిరంకుశ పాలన జరుగుతోంద‌ని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర‌రెడ్డి మండిప‌డ్డారు. అనంత‌పురం ఎస్‌పీ ఆఫీస్ వ‌ద్ద ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ని వెంటనే తాడిపత్రి లోకి అనుమతించాల‌ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా పోలీసులు అమలు చేయకపోవడం దుర్మార్గమ‌న్నారు. పెద్దా రెడ్డి వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాద‌ని, జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నేతల దౌర్జన్యాలు దేనికి నిదర్శనమ‌ని ప్ర‌శ్నించారు. ఓ మాజీ ఎమ్మెల్యేని ఏడాది కాలంగా అడ్డుకోవడం దేశం లో ఎక్కడైనా ఉందా? అని నిల‌దీశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి కి జరుగుతున్న అన్యాయం పై ఉద్యమిస్తామ‌ని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి హెచ్చ‌రించారు.  

Back to Top