తాడేపల్లి: చంద్రబాబు ఆదేశాలతో సీఎం వైయస్ జగన్ పై టీడీపీ నేత బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయిందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సంఘటనపై టీడీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియా, ఎల్లోమీడియాలో దుష్ప్రచారాలు చేశారు. ఇది చాలా బాధాకరం. మీకు మీరే రాయి వేయించుకున్నారు అనడం అత్యంత దారుణమన్నారు. శనివారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మీడియాతో ఏం మాట్లాడారంటే: టీడీపీ వారే దాడి చేశారని వాళ్ళే అంగీకరిస్తున్నారు: – ముఖ్యమంత్రి గారు మేమంతా సిద్ధం కార్యక్రమం బస్సు యాత్రలో భాగంగా విజయవాడ వస్తే.. ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. ప్రజలు విశేష స్పందన చూపడంతో ఆ కార్యక్రమం చాలా విజయవంతం అయ్యింది. – ఈ నేపథ్యంలో మా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక బాధాకర, దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. – ముఖ్యమంత్రి గారిని హతమార్చడానికి టీడీపీ నాయకులు పన్నాగం పన్ని హత్యాయత్నం చేశారు. – ముఖ్యమంత్రి గారిపైకి బలమైన రాయి విసరడం, ఆయన తలకు గాయం కావడం..కుట్లు పడటం అందరికీ తెలుసు. – పక్కనే ఉన్న నాకు కూడా ఆ రాయి తగలడంతో నా కన్ను దెబ్బతింది. వారం రోజులైనా ఇంకా కోలుకోలేదు. – ఈ సంఘటనపై టీడీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియా, ఎల్లోమీడియాలో దుష్ప్రచారాలు చేశారు. – ఇది చాలా బాధాకరం. మీకు మీరే రాయి వేయించుకున్నారు అనడం అత్యంత దారుణం. – సిద్ధం సభల నుంచి మేమంతా సిద్ధం కార్యక్రమం వరకూ ప్రజల స్పందన చూడండి. – ఎవరైనా చావు కొనితెచ్చుకుంటారా? దేహంలో అన్నిటి కంటే ముఖ్యమైన కంట్లో చిన్న నలకపడితేనే తట్టుకోలేం. – అటువంటిది రాయి వచ్చి కంటికి తగిలి ఇబ్బంది పడుతుంటే వ్యంగంగా మాట్లాడటం, హేళన చేయడం బాధాకరం. – బొండా ఉమా, చంద్రబాబు, ఆయన తొత్తుల మాటలను మీడియాలో చూస్తున్నాం. – బొండా ఉమాను ఇరికించాలని చూస్తున్నారు..అది జరిగితే జూన్4న మీ అంతు చూస్తానని చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఇక, బొండా ఉమా, పట్టాభిలు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. – ఒక సారి ఆలోచన చేస్తే ఈ సంఘటనలో టీడీపీ వారి హస్తం ఉందో లేదో వాళ్ల నొటి వెంటే వాస్తవాలు వచ్చాయి. పోలీసులు కంటే ముందే, రాయి ఎవరు విసిరారో బొండా ఉమాకి ఎలా తెలుసు..?: – బొండా ఉమా తొలుత ఇది వెలంపల్లి, కేశినేని నాని చేసిన కుట్ర అన్నాడు. – తర్వాత అన్నా క్యాంటీన్ తీసేశారని మా వాడే రాయి విసిరాడు అని చెప్తున్నాడు. – బొండా ఉమా మాట్లాడే సమయానికి పోలీసులు అసలు నిందితులు ఎవరో కూడా బయటకు వెల్లడించలేదు. – అన్నా క్యాంటీన్‌లు తీసేసినందుకే రాయి విసిరాడని బొండా ఉమా ఎలా చెప్తున్నాడు? – అంటే సతీష్‌తో ముందు పరిచయం అయినా ఉండి ఉండాలి. లేదంటే ఆయనే సతీష్‌ను ప్రేరేపించి దాడి చేయించి ఉంటాడు. – ఈ రోజు బొండా ఉమా తాగేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి గారిపై హత్యాయత్నం జరిగాక, బోండా ఉమ పలు సందర్భాల్లో ఎలా నాలుక మడతేశాడో, తన అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని ఎలా అంగీకరించాడో.. మాట్లాడిన వీడియోలను ఈ సందర్భంగా వెల్లంపల్లి మీడియా ఎదుట ప్రదర్శించారు. బోండా ఉమాపై ఈసీ చర్యలు తీసుకోవాలిః – సీపీని మీ సంగతి చూస్తాను..తాడేపల్లి నుంచి ఫోన్ వస్తే సెల్యూట్ చేస్తున్నాడు అంటూ అధికారులను బెదిరిస్తున్నాడు. – నేను ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నా. ఇతని వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకోవాలి. – సాక్ష్యాలను తారుమారు చేయడానికి అధికారులను బొండా ఉమా బెదిరిస్తున్నాడు. – లేదంటే అధికారులందరినీ పేర్లు పెట్టి డీజీపీ, సీపీ,ఏసీపీ, సీఐలను బెదిరించడం రౌడీయిజం కాదా? – సతీష్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి గారిపై దాడి చేసింది వాస్తవం. సాక్ష్యాధారాలతోసహా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. – గుంపులో వేశాం కదా..తెలియదులే అనుకున్నారు. కానీ పోలీసులు మీలా నిశానీ అనుకున్నారా? – బొండా ఉమా అనేక మంది పోలీసుల పేర్లుచెప్తున్నారు. అధికారులను ఎక్కడ వాడుకోవాలో వారికి తెలుసు. నువ్వెవరు చెప్పడానికి? తప్పు చేయకపోతే భయమెందుకు బోండా?: – నిన్ను పట్టుకోడానికి వంద మంది పోలీసులు కావాలా? – నిన్న నీకు నువ్వే నన్ను అరెస్ట్ చేస్తారు.. రండి..రండి అంటే వంద మంది కూడా రాలేదు. – ఈ రోజు ప్రెస్‌మీట్ పెడితే కనీసం మాజీ కార్పొరేటర్లు కూడా మద్దతు ఇవ్వడం లేదు. – బొండా ఉమా గెలవాలని, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కోరుకోవడం లేదు. – బొండా ఉమా ఓడిపోతే.. విజయవాడకు పట్టిన దరిద్రం పోతుందని వారు కూడా భావిస్తున్నారు. – ఓటమి భయంతో ఇలా చేస్తున్నాం అంటున్నాడు. నేను 3 నెలల నుంచి ప్రతి గడపా తిరిగాను. – నువ్వు ఎన్ని సార్లు బయటకు వచ్చావ్.. ఎన్ని గడపలు తిరిగావు? – అరగంట తిరుగుతావు..ఇంట్లో కూర్చుంటావు. నీ ప్రచారాన్ని ఎవరు ఆపారు? – నీకు నువ్వే ఈ తప్పు చేశావని తెలుసు కాబట్టే, ఈ దారుణం నువ్వే చేశావు కాబట్టే నువ్వు భయపడుతున్నావ్. – ఏ పోలీసు అయినా నిన్ను పిలిచారా? నిన్ను విచారించారా? నీకు నోటీసు ఇచ్చారా? – ఎందుకు నువ్వు భయపడాల్సిన అవసరం ఏంటి? పోలీసులను బెదిరించాల్సిన అవసరం ఏంటి? – ముందుగానే ఉలిక్కిపడుతున్నావంటే.. భుజాలు తడుముకుంటున్నావంటే.. చంద్రబాబు ఆదేశాలతో నువ్వే ఈ దారుణం చేయించావు అని అందరికీ అర్థమవటం లేదా.. బడుగు బలహీనవర్గాలను హత్యలు చేయించడానికి పావులుగా వాడుకుంటారా?: – నిస్సిగ్గుగా వేముల దుర్గారావు మా నాయకుడే అని బోండా ఉమా చెప్తున్నాడు. – పైపెచ్చు అతను మా బీసీ నాయకుడు..అతన్ని ఇబ్బంది పెడతారా అంటున్నాడు. – కోడికత్తి దాడి కేసులోలో ఎస్సీ నాయకుడిని ఇబ్బంది పెట్టారని అంటున్నాడు. – ఎస్సీ,బీసీలను మీరు హత్యలు చేయించడానికి పావులుగా వాడుకుంటారా?. ఈ విధంగా ఆ వర్గాలకు రౌడీయిజాన్ని అలవాటు చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నది మీరే కదా.. – ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం పదవులు, మంత్రి పదవులు ఇచ్చి నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ, నా ఎస్టీ అంటూ అధికారంలో భాగస్వామ్యులను చేశారు. ఎమ్మెల్యేల టికెట్లలోనూ బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు పెద్ద పీట వేశారు. – మీ చంద్రబాబు ఏమో, ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా – బీసీలను తోకలు కత్తిరిస్తానంటున్నాడు. – బడుగు బలహీన వరాలకు మేం అధికారంలో భాగం కల్పిస్తుంటే..వాళ్లని మీరు రౌడీలుగా, గూండాలుగా, హంతకులుగా తయారు చేస్తున్నారు. – మాట్లాడితే వడ్డెర కాలనీ అంటున్నాడు. ఆ కాలనీలను కూడా అభివృద్ధి చేయాలని మేం కోరుకుంటున్నాం. – మీరు వడ్డెర కాలనీని వడ్డెర కాలనీలా ఉంచాలని భావిస్తున్నారు. మేం ఆ కాలనీని ఏలూరు, బందరు రోడ్డుల్లా డెవలెప్ చేయాలనుకుంటున్నాం. నూటికి నూరు పాళ్లు చంద్రబాబు ఆదేశాలతో బొండా ఉమానే దాడి చేయించాడు: – బోండా ఉమా.. ముఖ్యమంత్రి గారి మీద హత్యాయత్నం చేయించి, ఇంకా కట్టకథలు అల్లవద్దు. నీ సానుభూతి డ్రామాలకు పడేవారెవరూ లేరు. – ముఖ్యమంత్రిగారిపై దాడి చేసిన విషయంలో మా వైఎస్సార్సీపీ కార్యకర్తలంతా ఉడికిపోతున్నారు. – జగన్ గారి అభిమానులు బాధ పడుతున్నారు. నేను డోర్ డోర్ పాదయాత్ర చేస్తుంటే తప్పు చేసిన వాడిని వదలొద్దని నీ గురించే ప్రజలు ముక్తకంఠంతో చెప్తున్నారు. – నేను నామినేషన్ వేసిన వ్యక్తి అంటున్నావ్..నువ్వు నామినేషన్ వేయడానికి నీ కుటుంబ సభ్యులు తప్ప ఒక్క కార్యకర్త రాలేదు. అదీ సెంట్రల్ నియోజకవర్గంలో నీకున్న పేరు..మర్యాద. – నువ్వు దిగజారిపోయావ్..సెంట్రల్‌లో నీకు డిపాజిట్లు పోయే పరిస్థితి ఉంది. – ఒక రోజు తిరగలేవు..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కరోనాలో ఒక్క సారైనా ప్రజల్ని చూశావా? – అసలు జనంలో కలిసే నైజం నీకుందా? బార్లలో కూర్చుని విలాసాలు చేయడం, తాగడం తప్పనువ్వు చేసిందేముంది? – పోలీసు అధికారులను కోరుతున్నాను. నూటికి నూరు పాళ్లు చంద్రబాబు ఆదేశాలతో బొండా ఉమానే దాడి చేయించాడు. – దాడిచేసినవారంతా.. టీడీపీ వారే. ముఖ్యమంత్రి గారిని హతమార్చడానికి చేసిన ప్రయత్నం ఇది. – దీన్ని తక్కువగా చేయాలని ఆలోచన చేయవద్దు. బొండా ఉమానే ఈ దాడికి ప్రేరేపించినట్టు.. అన్ని ఆధారాలు దొరుకుతాయి. – ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసిన సతీష్‌ను పోలీసులు పట్టుకుంటే... ఆ వెంటనే దుర్గారావును తన ఇంటికి తీసుకెళ్లి అతన్ని బొండా ఉమా బతిమిలాడుకున్నాడని బయట మాట్లాడుకుంటున్నారు. – ఇటువంటి కాల్‌మనీ సెక్స్‌రాకెట్ గాళ్లు విజయవాడలో పనికి రారని 2019లో ప్రజలు నిర్ణయించారు. – 2024లో కూడా డిపాజిట్ లేకుండా ఓడిస్తారు. – స్వతంత్య్ర సమరయోధులు భూములు కబ్జా చేయడానికి ప్రయత్నం చేశాడు. ఎక్కడ కాళీ భూములు కనిపించినా కబ్జాకు ప్రయత్నం చేస్తారు. – నీ కొడుకు బైక్ ర్యాలీలో మనుషులను చంపించేస్తాడు. – కాల్‌మనీ సెక్స్ రాకెట్ ద్వారా మహిళల జీవితాలతో చెలగాటమాడిన మీరు శ్రీరామచంద్రులా? – శ్రీరామనవమికి మా ఇంట్లో పూజ చేశాను అంటున్నాడు. ఎందుకయ్యా దేవుడి పేరు వాడుకుంటారు? – బొండా ఉమా బెదిరించవద్దు. నేను ఎన్నికల కమిషన్‌ను కలిసి అధికారులను బెదిరిస్తున్న అంశంపై ఫిర్యాదు చేస్తాను. బొండా ఉమా...నువ్వు తప్పుచేశావ్..శిక్ష తప్పదు: – అసలు పోలీసులు చెప్పకుండా కేసులో అన్ని విషయాలు ఎలా తెలుస్తున్నాయి? – అతనికి ఈ కేసులో పూర్తి సమాచారం ఉంది. ఎందుకంటే అతనే చేయించాడు కాబట్టి. – పోలీసులు సాక్ష్యాధారాలతో బయట పెడుతున్నారు కాబట్టే వణికిపోతున్నాడు. – బొండా ఉమా తప్పు చేశావ్..ఆ దేవుడు నిన్ను వదలడు. తప్పకుండా నువ్వు శిక్ష అనుభవిస్తావ్. – తప్పకుండా సాక్ష్యాలు దొరికితే కఠినమైన చర్యలు తప్పవు. – జూన్ 4 తర్వాత జగన్ అనే నేను... అనే ప్రభంజనం తప్ప వేరేది ఏమీ కనిపించదు. – ప్రతిపక్షాలవి ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప వాటిలో పస లేదు. – గెలిచే లక్షణాలు వాళ్లకుంటే..బీజేపీ, జనసేనలను ఎందుకు కలుపుకుంటారు? – ఇన్ని పొత్తులు, జిత్తులు, గమ్మత్తులు ఎందుకు? – జూన్4 తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి గారు ప్రమాణస్వీకారం చేయగానే ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపిస్తాం. – ఎవరు దోషులైతే వారిని కఠినంగా శిక్షించే పని మా ప్రభుత్వం చేస్తుంది. – ఈ కేసు సీబీఐకి అప్పజెప్పాలంటున్న వారే... ఆనాడు ఇదే సీబీఐని ఈ రాష్ట్రానికి రాకుండా చేశారు. – సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టకూడదు అని తీర్మానం చేసింది చంద్రబాబు కాదా? – మీరా సీబీఐ గురించి మాట్లాడేది? ఒక మాట మీద నిలబడరా మీరు? – సీబీఐపై అంత నమ్మకమే ఉంటే..అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేశారో బొండా ఉమా సమాధానం చెప్పాలి. – మీరు బెదిరించినా అధికారులు తప్పు చేసిన వారిని ఎవర్నీ వదలరనేది నా నమ్మకం. – ఒక ముఖ్యమంత్రి గారిపై హత్యాయత్నం జరిగితే..సింపతీ అంటారా? అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు.