చిత్తూరు: స్వాతంత్ర్య దినోత్సవం నాడు జాతీయ జెండాపై చెప్పులతో టీడీపీ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నడవడం పట్ల వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. జాతీయ జెండాను అవమానించడం...ఇదేనా మీ దేశభక్తి అంటూ చంద్రబాబు, నారా లోకేష్, ఎమ్మెల్యే ఆంజనేయులును ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. చంద్రబాబు, లోకేష్ ..ఇదేనా మీ దేశభక్తి, జాతీయ జెండాపై చెప్పులతో నడిచి అవమానించిన మీ పార్టీ నాయకుడు వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులుపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. శత్రువులు కూడా ఇలాగ చేయరేమో, కానీ ఒక బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధి ఇలా చేస్తే ప్రజలు మిమ్మల్ని ఎలా గౌరవిస్తారు?` అంటూ రోజా నిలదీశారు.