వైయ‌స్ఆర్‌సీపీ నేతపై హత్యాయత్నం

మారణాయుధాలు, కర్రలతో టీడీపీ నేత, అనుచరుల స్వైరవిహారం

చిత్తూరు జిల్లా: వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి సరస్వతి భర్త,  పార్టీ నేత మధుసూదన్ నాయు డుపై టీడీపీ నేత రెడ్డెప్ప నాయుడు తన అనుచరులతో కలిసి శనివారం హత్యాయత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితుడి కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా సోమల మండలం ఇరికిపెంటకు చెందిన మధుసూదన్ నాయుడు, సరస్వతి సదుం లో హోటల్ నిర్వహిస్తున్నారు. శనివారం ఆడికృత్తిక కావడంతో బైక్‌పై మధుసూదన్ నాయుడు స్వగ్రామానికి వెళ్లారు. తర్వాత బైక్‌పై ఇరికిపెం ట నుంచి సదుం బయల్దేరారు. మార్గంమధ్యలో బంగ్లాకు చెందిన టీడీపీ నేత రెడ్డెప్ప నాయుడు, అతని అనుచరులు ఆయనను వెంబడించి మార ణాయుధాలు, కర్రలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. మధుసూదన్ నాయుడును చంపడానికి యత్నించారు. అతను కేకలు వేస్తూ వారి దాడినుంచి తప్పించుకున్నారు. పాత కక్షలతోనే తనను హత మార్చడానికి కుట్ర పన్నినట్టు మధుసూదన్ నాయుడు తెలిపారు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన | మధుసూదన్ నాయుడును సదుం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సదుం ప్రభుత్వాస్పత్రిలో మ‌ధుసూద‌నానాయుడు చికిత్సపొందుతున్నారు. 

Back to Top