బాబుకే కాదు, టీడీపీకి కూడా 2024 చివరి ఎన్నికలు

మాజీ మంత్రి కొడాలి నాని

కృష్ణా: చంద్రబాబుకే కాదు, టీడీపీకి కూడా 2024 చివరి ఎన్నికలు అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. రాష్ట్ర ప్రజలను తెలుగుదేశం పార్టీ మోసం చేసిందన్నారు. ఈ సందర్భంగా కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. ఎవరికీ భయపడేది లేదని, ఎంతమంది వచ్చినా గుడివాడను ప్రభావితం చేయలేరన్నారు. గుడివాడలో చంద్రబాబు పోటీ చేసినా తాను రెడీ అన్నారు. చంద్రబాబును మించిన సైకో మరొకరు లేరన్నారు. కర్నూలులో హైకోర్టు గురించి న్యాయవాదులు ప్రశ్నిస్తే గుడ్డలూడదీసి కొడతానని చంద్రబాబు మాట్లాడాడని గుర్తుచేశారు. 2024 ఎన్నికల తరువాత ఇదేం ఖర్మరా అని బాబు, లోకేష్‌ అనుకుంటారని కొడాలి నాని ఎద్దేవా చేశారు.

 

Back to Top