వాలంటీర్ల జోలికి వస్తే నిన్ను, నీ దత్తతండ్రిని ప్రజలు తరిమి కొడతారు.. 

మాజీమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (ఆళ్ల నాని) 

పవన్‌, చంద్రబాబు కలిసి చేస్తున్న నీచమైన దాడే ఇది.. 

ప్రజలు మిమ్మల్ని ఛీత్కరించుకుంటున్నారనే వాలంటీర్లపై దాడి. 

మహిళల అక్రమ రవాణాకు, వాలంటీర్లకు సంబంధం ఏమిటి? 

చంద్రబాబు స్క్రిప్ట్ ఇస్తే పవన్ దాన్ని చదువుతూ ఊగిపోతున్నాడు 

ముందు వాలంటీర్ల వ్యవస్థ ఏమిటో అధ్యయం చేసి మాట్లాడు పవన్ 

 మాజీమంత్రి  ఆళ్ల నాని ఫైర్ 

ఏలూరు:  వాలంటీర్ల జోలికి వస్తే నిన్ను, నీ దత్తతండ్రిని ప్రజలు తరిమి కొడతార‌ని మాజీమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (ఆళ్ల నాని) ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను హెచ్చ‌రించారు. ఏలూరులో మాజీమంత్రి  ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (ఆళ్ల నాని) ఆదివారం మీడియాతో మాట్లాడారు.   సీఎం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలవద్దకు తీసుకువెళ్లగలుతున్నాం.

- గత టీడీపీ హయాంలో ఉన్న అరకొర పథకాలకు లబ్దిదారుల సంఖ్య కూడా తక్కువగానే ఉండేది. అర్హులైన వారికి ఎవ్వరికీ పెన్షన్లు, రేషన్‌ కార్డులు, ఇళ్ల స్థలాలు ఉండేవి కాదు. ప్రభుత్వం ద్వారా పేదలకు పథకాలు అందేవి కాదు. ఎందుకు అంటే జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నాయకులు, కార్యకర్తలకే, అభిమానులకే ఇచ్చేవారు. 

- ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయిని టీడీపీ నాయకులు దోచుకు తింటున్నారని పాదయాత్రలో వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పేదవారి మొరను జగన్ గారు విన్నారు. పేదవారిని జన్మభూమి కమిటీలు మోసగించటం తెల్సుకుని.. జన్మభూమి కమిటీలు రద్దు చేశారు. దీంతో పేదలకు సంక్షేమ పథకాలను అందించటానికి అవినీతి లేకుండా పారదర్శకంగా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. 

- ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఒక్క పథకాన్నీ పేదవారు కోల్పోకూడదని అత్యంత పారదర్శకంగా వ్యవస్థను నడపాలని జగన్ గారు నిర్ణయించారు. దాని ఫలితంగా 2.60 లక్షల యువతీ యువకులను వాలంటీర్లుగా తీసుకువచ్చారు. యువత ఉద్యోగాల్లో స్థిరపడే లోపే జగన్ గారు చేస్తున్న అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే అవకాశం ఇచ్చారని వాలంటీర్లుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.  మాకు కుదిరినంత కాలం రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు అవుతామని స్వచ్ఛందంగా వాలంటీర్లు వచ్చారు. ఈ వాలంటీర్ల వ్యవస్థను కూలదోయటానికి పవన్ కల్యాణ్‌ నీచానికి దిగజారు. సీఎం జగన్‌ మోహన్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రాభివృద్ధికి జరుగుతున్న మహాయజ్ఞంలో వాలంటీర్లు భాగస్వాములుగా కొనసాగండి. మేమంతా వాలంటీర్లకు అండగా ఉంటాం. 

- ఎందుకు ఈ రోజు వాలంటీర్ల వ్యవస్థపై ఇంత దాడి జరుగుతోంది. మొన్న మొన్నటివరకు వ్యక్తిగతంగా విషం చిమ్మే కార్యక్రమానికే చంద్రబాబు, పవన్ పరిమితమయ్యారు. ఈరోజున సీఎం జగన్‌ గారిపై ఎన్నో అసత్య ప్రచారాలు, దుష్ప్రచారాలు, దూషణల ద్వారా ప్రజల్లో చులకన చేయాలని, అప్రతిష్ఠపాలు చేయాలని కుట్రలు పన్నారు. పవన్ మాట్లాడిన తీరును ప్రజలు అసహ్యించుకున్నారు. వ్యక్తిగతంగా ఎంత విమర్శించినా, దూషించినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని పవన్‌, చంద్రబాబు కలిసి చేస్తున్న మహాపాపం వాలంటీర్లపై దాడి. 

- జగన్‌ గారికి అండగా ఉన్న వాలంటీర్ల వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఆయన్ను ప్రజల్లో బలహీనం చేద్దామని ప్రయత్నిస్తున్నారు. సీఎం జగన్ గారికి మేలు కలిగించేది కాదు వాలంటీర్ల వ్యవస్థ. ప్రభుత్వానికి, ప్రజల మధ్య అనుసంధానంగా ఉంటూ జగన్‌ గారు అందజేసే ప్రతి పథకాన్ని ప్రజలకు చేరువగా తీసుకువెళ్లేది ఈ వాలంటీర్లు వ్యవస్థ. జీవితంలో స్థిరపడేలోపు ప్రజలకు సేవ చేద్దామని స్వచ్ఛందంగా వాలంటీర్లు ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు అయ్యారు. 

- చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ కల్యాణ్‌ చదువుతూ పోయే క్రమంలో అవగాహన లేకుండా, అధ్యయనం చేయకుండా దిగజారి మాట్లాడుతున్నాడు. నిస్వార్థంగా, త్యాగనిరతితో సేవ చేస్తున్న వాలంటీర్ల తల్లిదండ్రులు బాధపడేలా నీచమైన ఆరోపణలు చేయటం పవన్ నీచమైన మనస్తత్వానికి నిదర్శనం కాదా? మహిళల అక్రమ రవాణాకి వాలంటీర్లే కారణమని ఏలూరు సభలో పవన్‌ మాట్లాడారు. అసలు వాలంటీర్లకు, మహిళ అక్రమ రవాణాకి సంబంధం ఏమిటి పవన్ కల్యాణ్‌. చంద్రబాబు నీచమైన స్క్రిప్ట్ రాసి ఇస్తే.. కనీసం మానవత్వం లేకుండా ఒక మనుషులు చేసే పనేనా ఇది. 

- సీఎం జగన్ గారు అందజేస్తున్న పథకాలు ప్రజలకు అందుతున్నాయా, పింఛన్ వస్తోందా? రేషన్ కార్డు వస్తోందా? అమ్మ ఒడి వస్తోందా? వసతి దీవెన వస్తోందా? ఇళ్ల స్థలం వస్తోందా? లేదా అని ప్రతి ఇంటికీ వాలంటీర్లు వెళ్లి కుటుంబ సభ్యుడిలా అండగా నిలబడుతున్నారు. 

- అలాంటి వాలంటీర్లను..మహిళల అక్రమ రవాణాతో పోలుస్తూ నీచంగా మాట్లాడటం ఏమిటి? ఎవరో కేంద్రంలో నిఘా వర్గాలు సమాచారం ఇచ్చారట. ఆ సమాచారం ఇచ్చి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను హెచ్చరించాల్సిందిగా పవన్‌ కల్యాణ్‌కు చెప్పారట. వార్డు మెంబర్‌ కాదు, కార్పొరేటర్‌ కాదు, ఎమ్మెల్యే కాదు.. ఏమీ కానీ పవన్‌ కల్యాణ్‌కు కేంద్ర నిఘా వర్గాలు ఫోన్ చేసి చెప్పాయంట. 

- రానున్న ఎన్నికల్లో ఛీత్కరించే పరిస్థితి వచ్చిందని వాలంటీర్లపై దుష్ప్రచారం చేస్తున్నారు. మీరంతా జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. వాలంటీర్లు చేస్తున్న సేవా కార్యక్రమాలకు మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. 

- రాష్ట్రవ్యాప్తంగా ఎంత అభివృద్ధి జరుగుతుందో అధ్యయనం చేసుకోండి పవన్ కల్యాణ్‌. అసత్య ప్రచారాలతో పవన్ కల్యాణ్‌ దిగజారిపోయారు. చంద్రబాబును సీఎం చేయాలనే లక్ష్యంతో పవన్ కల్యాణ్‌ వ్యవహరిస్తున్నారు. రాష్ట్రానికి ఎంతో కొంత సేవ చేయకపోతే.. చంద్రబాబును తరిమి కొట్టినట్లే.. పవన్‌ కల్యాణ్‌ను కూడా ప్రజలు తరిమి కొడతారు. వాలంటీర్ల జోలికి వచ్చినా, దూషణలు చేసినా ఊరుకునేది లేదు. పవన్ కల్యాణ్‌ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నా.

తాజా వీడియోలు

Back to Top