సీఎంను కలిసిన మత్స్యకారులు

తాడేపల్లి: పాకిస్తాన్‌ జైల్‌ నుంచి విడుదలైన మత్స్యకారులు  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. 14 నెలల పాటు పాకిస్తాన్‌ జైల్లో మగ్గిన మత్స్యకారులు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చొరవతో విడుదలయ్యారు. వాఘా సరిహద్దు నుంచి భారత్‌లోకి ప్రవేశించిన మత్స్యకారులను రాష్ట్ర మత్స్యకార శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఢిల్లీ నుంచి వారిని రాష్ట్రానికి తీసుకువచ్చారు. రాష్ట్రానికి వచ్చిన మత్స్యకారులు సీఎం వైయస్‌ జగన్‌ను కలిశారు. పాకిస్తాన్‌లో వారు పడ్డ కష్టాలను సీఎం వైయస్‌ జగన్‌ అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు. 20 మంది మత్స్యకారులు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున సీఎం ఆర్థిక సాయం అందజేశారు.

తాజా వీడియోలు

Back to Top