పెగాసస్‌ కొనడం ఘోరమైన నేరం

చంద్రబాబు దుర్మార్గాలపై హౌస్‌ కమిటీతో విచారణ జరిపించాలి

పెగాసస్‌ బాబు కొనుగోలు చేసినట్టు సమాచారమని అసెంబ్లీ సాక్షిగా మమతాబెనర్జీ చెప్పారు

చంద్రబాబు చర్య మానవ హక్కులకు భంగం కలిగించడమే

ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు చేతన్‌ సాయికృష్ణ కంపెనీకి టెండర్‌ ఎలా దక్కింది 

2017లో రెండుసార్లు ఏబీ వెంకటేశ్వరరావు ఇజ్రాయిల్‌కు ఎందుకెళ్లారు..?

రాజకీయ నేతలతో సహా 5 కోట్ల ఆంధ్రుల వ్యక్తిగత సమాచారం చోరీకి గురైంది

ఐటీ గ్రిడ్, సేవా మిత్ర ద్వారా ఓటర్‌ లిస్ట్‌ నుంచి టీడీపీ వ్యతిరేక ఓట్లను తొలగించారు

వైయస్‌ఆర్‌ సీపీ అలర్ట్‌ అవ్వడంతో టీడీపీ కుట్ర భగ్నం

ఐటీ గ్రిడ్ హెడ్ అశోక్ దాక‌వ‌రం లోకేష్‌కు అత్యంత స‌న్నిహితుడు

దేశంలో పెగాసస్‌ ఆపరేషన్‌ జరుగుతోందని ఇంటర్నేషన్‌ ఇన్వెస్టిగేషన్‌ జర్నలిజం సర్వేలో వెల్లడి

హౌస్‌ కమిటీతో విచారణ చేయించి.. దోషులను కఠినంగా శిక్షించాలి

అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ డిమాండ్‌

అసెంబ్లీ: ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు, సమాచారానికి తీవ్ర భంగం కలిగించే పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను కొనడం ఘోరమైన నేరమని, అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెగాసస్‌ కొనుగోలు చేశారని సమాచారం ఉందని అసెంబ్లీ సాక్షిగా పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చెప్పారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు చేసిన చర్య మానవహక్కులకు భంగం కలిగించడమేనని, పెగాసస్‌తో రాజకీయ నేతలు, వ్యాపారస్థులు, సామాన్య ప్రజల వ్యక్తిగత సమాచారం దొంగలించడంతో పాటు ఐటీ గ్రిడ్, సేవా మిత్ర ద్వారా ప్రజల స్వేచ్ఛకు చంద్రబాబు భంగం కలిగించారన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న వైయస్‌ఆర్‌ సీపీ తొందరగా అలర్ట్‌ అవ్వడంతో టీడీపీ కుట్ర భగ్నమైందన్నారు. అసెంబ్లీలో పెగాసస్‌పై సుదీర్ఘ చర్చ జరిగింది. పెగాసస్‌కు సంబంధించిన పూర్తి వివరాలను శాసనసభ ద్వారా మంత్రి బుగ్గన రాష్ట్ర ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి బుగ్గన ఇంకా ఏం మాట్లాడారంటే.. 
దేశంలో ఉన్న ప్రాథమిక హక్కులకు అత్యున్నతస్థానం రాజ్యాంగం ఇచ్చింది. గత కొన్ని నెలలుగా దేశంలో పెగాసస్‌ అనే స్పైవేర్‌ గురించి గందరగోళం జరుగుతుంది. అత్యున్నత న్యాయస్థానం విచారణకు కమిటీ వేసింది. కమిటీ రిటైర్డ్‌ సుప్రీం కోర్టు జడ్జి ఆర్‌.వీ.రవీంద్రన్‌ను చైర్మన్‌గా కమిటీని వేసింది. ఈ కమిటీలో అనుభవజ్ఞులను నియమించారు. రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి అలోఖ్‌ జోషి, డాక్టర్‌ సందీప్‌ ఓబరాయ్, ముగ్గురితో కూడిన టెక్నికల్‌ కమిటీని నియమించారు. డాక్టర్‌ నవీన్‌కుమార్‌ చౌదరి (దేశంలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీ డీన్‌), డాక్టర్‌ ప్రభాకరన్‌ (ప్రొఫెసర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, అమృతా విశ్వవిద్యాపీటం), డాక్టర్‌ అశ్విని అనిల్‌ (ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ హెడ్‌ ఆఫ్‌ ద డిపార్టుమెంట్‌). 

అత్యున్నత న్యాయస్థానం పెగాసస్‌ను తీవ్రంగా భావించి ఇంత పెద్ద కమిటీని వేసింది. ఇదే పరిస్థితిలో పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలో ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మాట్లాడుతూ నాలుగైదు సంవత్సరాల క్రితం బెంగాల్‌ ప్రభుత్వానికి స్పైవేర్‌ అమ్మేందుకు సంప్రదించింది. అప్పట్లో రూ.25 కోట్ల మేర అడిగారు.. మేము తీసుకోలేదు. కానీ, అప్పటి ఆంధ్రప్రదేశ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పైవేర్‌ తీసుకున్నట్టు నాకు సమాచారం అని మమతాబెనర్జీ చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. 

బెంగాల్‌ అసెంబ్లీలో హోండిపార్టుమెంట్‌కు సంబంధించిన బడ్జెట్‌ కేటాయింపుల విషయంలో మాట్లాడుతూ పెగాసస్‌ కంపెనీ (ఎన్‌ఎస్‌ఓ గ్రూపు అని ఇజ్రాయిల్‌కు చెందిన కంపెనీ) స్పైవేర్‌ బెంగాల్‌ ప్రభుత్వానికి అమ్మేందుకు రావడం జరిగింది. మేము వద్దన్నాం.. కానీ, అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నారా చంద్రబాబు కొనుగోలు చేసినట్టు సమాచారం అని మమతా బెనర్జీ చెప్పారు. 

వేరేవారి వ్యక్తిగత విషయాల్లోకి తొంగిచూడటం ఎంత తప్పో తెలిసినా కూడా పెగాసస్‌ స్పైవేర్‌ కొనుగోలు చేయడం.. మానవ హక్కులను చోరీ చేసినట్టే. పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ ఫోన్‌కు మిస్డ్‌కాల్‌ ఇచ్చినా ఫోన్‌లోకి ఎంటర్‌ అవుతుంది. ఆ పెగాసస్‌ ద్వారా పరిణామాలు.. ఎవరికి ఫోన్‌ చేస్తున్నామో, మెసేజ్‌లు, వాట్సాప్, కాంటాక్టులు, చివరకు ఎంత ప్రమాదకరమంటే.. కెమెరాలోకి కూడా ప్రవేశిస్తుంది. ఆ ఫోన్‌ ద్వారా మనం ఎక్కడున్నాం.. ఎవరితో మాట్లాడుతున్నాం.. కాంటాక్ట్‌ డీటైల్స్, మెసేజ్‌లు, నోట్స్‌లో ఫీడ్‌ చేసుకుంటామో, చివరకు మన పాస్‌వర్డ్స్‌ కూడా తెలుసుకునే ప్రమాదకరమైన సాఫ్ట్‌వేర్‌. అందుకనే చట్టానికి విరుద్ధం కాబట్టే.. ఘోరమైన నేరంగా కాబట్టే మమతా బెనర్జీ పద్ధతిగా నాకొద్దు అని తిరస్కరించింది. 

సభలో మమతా బెనర్జీ చెప్పినట్టుగా చంద్రబాబు పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు చేశారంటే.. ఇంత దారుణమైన నేరమో గమనించాలి. రాజకీయ నాయకులు, వ్యాపారస్థులు, చివరకు భార్యభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నా తెలిసే ప్రమాదం ఉంది. ఇది ఒక నంబర్‌ కాదు.. ఇష్టానుసారంగా ఏ నంబర్‌ కావాలంటే ఆ నంబర్‌ను ట్రాక్‌ చేసే ప్రమాదం ఉంది. మొత్తం 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం మొత్తం 2017–18–19లో పెగాసస్‌ కొనుగోలు చేసి ఉంటే చోరీకి గురైనట్టు నిర్దారణ అవుతుంది. 

పెగాసస్‌ను కొనుగోలు చేశారా..? చేసి ఉంటే దానితో ఏం చేశారు..? ఇంకా ఏమేమి చేశారో ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది. జూలై 2020–21లో ఇంటర్నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ జర్నలిస్టులు ఒక ఇన్వెస్టిగేషన్‌ చేశారు. పలు దేశాలు అజర్‌బాయిజాన్, హంగేరీ, కజకిస్థాన్, మెక్సికో, మొరక్కో, రవాండ, సౌదీ అరేబియా, యూనైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తో పాటు భారతదేశంలో కూడా పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ ఎవరో ఒకరు కొన్నారని, ఆపరేట్‌ అయ్యిందని ది పెగాసస్‌ ప్రాజెక్టు అనే పేరుమీద ఇంటర్నేషన్‌ ఇన్వెస్టిగేషన్‌ జర్నలిజం చేసిన సర్వేలో తేలింది. 

2016లో ఇది మొట్టమొదటిసారి బయటపడినట్టు, 2019లో వాట్సాప్‌ కంపెనీ మా అప్లికేషన్స్‌లోకి ఎవరో వస్తున్నారని ఫిర్యాదు చేశారు. పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రమాదకరమైన స్పైవేర్, ఇది భారతదేశంలో ఆపరేషన్‌లో ఉందని అర్థం అవుతుంది. అక్టోబర్‌ 2019లో వాట్సాప్‌ కంపెనీ కంప్లయింట్‌ చేసింది. ఆ తరువాత 2019లోనే ఐఫోన్‌ కంపెనీ కూడా కంప్లయింట్‌ ఇచ్చారు. కచ్చితంగా పెగాసస్‌ సాఫ్ట్‌వేరు వాడకంలో ఉన్నట్టు తెలుస్తుంది. 

చంద్రబాబు పెగాసస్‌ కొన్నారని మమతాబెనర్జీ అన్నట్టుగా ఈనాడులో కూడా రాశారు. డ్రోన్లు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏవీ వెంకటేశ్వరరావు 2017లో ఒక ప్రపోజల్‌ అప్పటి డీజీపీకి పెట్టారు. ఆగస్టు 30, 2017లో అప్పటి డీజీపీ హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి ఉత్తరం రాశారు. భద్రత అవసరాల కోసం డ్రోన్లు కొనుగోలు చేయాలని ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అడుగుతున్నారు.. కాబట్టి డ్రోన్లు ప్రాపర్‌ విధానంతో కొనుగోలు చేయాలని, అప్పటి స్టేట్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా కొనుగోలు చేయాలని అభిప్రాయపడ్డారు. ఆ తరువాత డ్రోన్లు కొనుగోలు చేయడానికి నాలుగు కంపెనీలు ముందుకువచ్చాయి. మెసెర్స్‌ రేడియల్ట్‌ కోరల్‌ డిజిటల్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బెంగళూరు, మెసెర్స్‌ ఆల్సాఫ్‌ హెలికైడ్స్‌ లిమిటెడ్‌ ఇంగ్లాండ్, మెసెర్స్‌ ఆర్‌టీ ఇన్‌ప్లైటబుల్‌ ఆబ్జేక్ట్స్‌ లిమిటెడ్‌ ఇజ్రాయిల్, మెసెర్స్‌ ఎన్‌వీఎం స్కైటెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గురుగ్రాం. డ్రోన్లు సప్లయ్‌ చేస్తామని ముందుకొచ్చిన నలుగురిలో మెసెర్స్‌ ఆర్‌టీ ఇన్‌ప్లైటబుల్‌ ఆబ్జేక్ట్స్‌ లిమిటెడ్‌ ఇజ్రాయిల్‌ తప్ప మిగతావారు డ్రాప్‌ అయిపోతారు. ఈ కంపెనీ ఎవరిదీ అంటే.. ఇండియాలో సంబంధించిన డీలర్‌ ఆకాశం అడ్వాన్డ్స్‌ సిస్టమ్స్‌. ఈ కంపెనీలో చేతన్‌ సాయికృష్ణ ఆలూరు ఇంచుమించు ఫౌండర్‌ ఆఫ్‌ ది కంపెనీ. ఈ వ్యక్తి స్వయాన ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు. ఆకాశం అడ్వాన్డ్స్‌ సిస్టమ్స్‌ కంపెనీ 11–07–2017లో స్థాపించారు. డ్రోన్స్‌ కొనుగోలు కోసం 14–06–2017లో ఏబీ వెంకటేశ్వరరావు ప్రపోజల్‌ పెట్టారు.  అదే జూలైలో ఆకాశం కంపెనీస్థాపించారు. ఆ కంపెనీ ద్వారా ప్రభుత్వానికి సప్లయ్‌కి వస్తారు. టెండర్‌కు వచ్చిన నాలుగు కంపెనీల్లో ఆకాశం కంపెనీ మాత్రమే ఎలా మిగిలిపోయింది. రూ.25 కోట్లతో డ్రోన్లు కొనాలని ప్రతిపాదన చేశారు. 02–04–2017లో ఒకసారి, 19–11–2017లో మరోసారి ఏబీ వెంకటేశ్వరరావు ఇజ్రాయిల్‌కు వెళ్లారు. 

రూ.16 కోట్లు మంజూరైన తరువాత.. రూ.25 కోట్లు చాలదని చెప్పి.. ఆల్రెడీ 3.37 కోట్ల రూపాయల లెఫ్ట్‌ ఓవర్‌ బడ్జెట్‌ ఉంది.. అర్జెంట్‌గా దాన్ని ఇచ్చేయండి.. రూ.4.80 కోట్లు, రూ.16 కోట్లతో కలిపి ఇవ్వాలని లేఖ రాశారు. స్టేట్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ ఫైనలైజ్‌ చేస్తుంది. అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ వెహికిల్‌ రూ.22.19 కోట్లు, ఎయిరోస్టాట్స్‌ రూ.3.31 కోట్లు. రెండూ కలిపి రూ.25.5 కోట్లు. ఆ తరువాత వివిధ పోలీస్‌ అధికారులు కూర్చొని సడన్‌గా దాన్ని రద్దు చేశారు. రద్దు చేసిన తరువాత కూడా వెంకటేశ్వరరావు పదే పదే పునరుద్ధరించాలని కోరిన విషయం కూడా కనిపిస్తుంది. 

ఇదే సమయంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తన ఫోన్‌ ట్యాంపర్‌ అయ్యిందని రిట్‌ పిటీషన్‌ వేశారు. తన వ్యక్తిగత నంబర్, వైయస్‌ఆర్‌ సీపీకి చెందిన కొంతమంది ఫోన్ల నంబర్లు అన్నీ కలిసి 24–12–2018న ఒక లెటర్‌ ద్వారా  ఆథరైజ్డ్‌ ట్యాపింగ్‌లో పెట్టారు. టె్రరరిస్టులు, ఇంటర్నేషనల్‌ క్రిమినల్స్‌కు సంబంధించిన లిస్టులో ఈ లిస్టు కూడా  పెట్టారు. అప్పటి ఇంటెలిజెన్స్‌ డిపార్టుమెంట్‌ రాష్ట్రానికి, దేశానికి, మావోయిస్టులపై పెట్టాల్సిన నిఘా అనవసరంగా నాపై పెట్టారని సజ్జల అఫిడవిట్‌ పెట్టారు. సెక్షన్‌ 52 ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ యాక్ట్‌ 1885, ఆర్టికల్‌ 19/1, 21 రాజ్యాంగానికి, 69 ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌కు విరుద్ధంగా ఉందని రిట్‌ ఫైల్‌ చేశారు.

రాజకీయ నేతలతో పాటు ప్రతి ఓటర్‌పై నిఘా పెట్టేందుకు ప్రయత్నం చేశారని తెలుస్తోంది. ఐటీ గ్రిడ్‌ అనే కంపెనీ మీద 02–03–2019లో మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కంప్లయింట్‌ అందింది. సేవా మిత్ర యాప్‌ ద్వారా తెలుగుదేశం పార్టీ వారు ప్రతి ఓటర్‌ మీద నిఘా పెట్టి.. ఆ నిఘా ద్వారా వారు ఏ పార్టీకి ఓటు వేసేందుకు అవకాశం ఉందని కనుక్కున్న తరువాత ఆ ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు ప్రయత్నం చేసినట్టు ఆధారాలు కనిపిస్తున్నాయి. 

2016లో టీడీపీ ప్రజాసాధికార సర్వేను మొదలుపెట్టారు. పథకాల లబ్ధిదారుల వివరాలు తీసుకున్నారు. వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలను పంపించి రైతురుణమాఫీ అయ్యిందా..? టీడీపీకి ఓటువేస్తేనే రుణమాఫీ, ఇళ్లు వస్తుంది.. టీడీపీ సభ్యత్వం తీసుకుంటే వస్తాయని సర్వేచేశారు. ఆ తరువాత ఆర్టీజీఎస్‌ అనే వ్యవస్థ పెట్టి డేటా అంతా ఇంటిగ్రేట్‌ చేసుకున్నారు. 1100 ద్వారా అన్నీ అందుతున్నాయా అని ఫోన్లు చేసేవారు. ఎవరైనా టీడీపీ పాలన బాగోలేదని చెబితే.. టీడీపీకి ఓటువేయరు.. జాబితా నుంచి తొలగిస్తే బెటర్‌ అని అప్పటి ప్రభుత్వం ప్లాన్‌ చేసింది. 

ట్యాబ్‌ ద్వారా ప్రతి వంద ఇళ్లకు ఒక వ్యక్తి వెళ్లి.. ప్రజాసాధికారత సర్వేలో వేసిన ప్రశ్నలే వేస్తారు. అప్పుడు గత ప్రభుత్వ బాగోతం బయటపడింది. ట్యాబ్‌లో పేరు ఎంటర్‌ చేయగానే.. మొత్తం ఆధార్‌ కార్డు సమాచారం మొత్తం వచ్చేస్తుంది. ఆధార్‌ డీటైల్స్‌ పార్టీకి సంబంధించిన దాంట్లోకి ఎలా వెళ్లిందని అలర్ట్‌ అయ్యి అప్పుడు 02–03–2019లో మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కంప్లయింట్‌ చేయడం జరిగింది. ఆ ట్యాబ్‌లో కలర్‌ ఫొటోతో సహా  సమాచారం ఉంది. ఓటల్‌ లిస్ట్‌ నుంచి డేటా తీస్తే బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో వస్తుంది కానీ, కలర్‌ ఫొటో ఎలా వచ్చిందనే అనుమానం విచారణలో తేలింది. మనం, మన పిల్లలు, మహిళలు, బ్యాంక్‌ అకౌంట్లు సమాచారం  టీడీపీ సంస్థలోకి వెళ్లిందని ఆరోజు తెలిసింది. 2014లో ఓటు హక్కు వినియోగించుకున్న చాలా మంది ఓట్లు తీసేశారు. 

ఐటీ గ్రిడ్‌ హెడ్‌ అశోక్‌ దాకవరం, ఇతను చంద్రబాబు కంటే లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆధార్‌‡డేటాను అనైతికంగా, చట్టవిరుద్ధంగా దొంగతనం చేసి ఐటీ గ్రిడ్‌ అనే ప్రైవేట్‌ కంపెనీకి ఇచ్చారు. ఆ కంపెనీ ద్వారా అందరి బ్యాగ్రౌండ్‌ సేకరించి.. ప్రజాసాధికారత సర్వే ద్వారా, సేవా మిత్ర ద్వారా ప్రజల అభిప్రాయాలు సేకరించి.. అసంతృప్తితో ఉన్నవారి పేర్లను ఓటర్‌ జాబితా నుంచి జనవరి, ఫిబ్రవరిలో తీసేయడానికి ప్లాన్‌ చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న మనం తొందరగా అలర్ట్‌ కావడంతో టీడీపీ ప్లాన్‌ భంగమైంది. ఇదొకవైపు చేస్తూనే ముంబాయిలో ఈవీఎంలను చోరీ చేసిన వారిని తీసుకువచ్చి సలహాదారులుగా పెట్టుకున్నాడు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఎంత అపహాస్యం చేశాడో అర్థం చేసుకోవచ్చు. 

ఒకవైపున వ్యక్తిగత సమాచారం దొంగలించడం, మరోవైపు ఓట్లను తొలగించడం, ఇంకోవైపు ఫోన్లు ట్యాంపరింగ్‌ చేయడం.. దీనిపై చాలా లోతుగా విచారణ జరగాలి. ఇలాంటి దుర్మార్గాలకు చరమగీతం పాడాలి. దీనిపై హౌస్‌ కమిటీ వేసి.. గత టీడీపీ ప్రభుత్వం చేసిన పెగాసస్‌ దుర్మార్గంతో పాటు ఇతర నేరాలపై కూడా కచ్చితంగా విచారణ చేసి.. తప్పు చేసిన వారిని కచ్చితంగా శిక్షించాలని కోరుతున్నాం. 

 

Back to Top