ఆ దుర్బుద్ధితోనే అప్పులపై విపక్షాల విషప్రచారం

ఏపీ అప్పులపై కేంద్ర ఆర్థిక మంత్రి సమాధానాన్ని ఎందుకు ప్రచురించరు..?

అప్పుల‌పై ఎల్లో మీడియా రాత‌లు ఆశ్చ‌ర్యంగా ఉన్నాయి..

వెయ్యి కోట్ల అప్పు ఐదుసార్లు పత్రికల్లో రాస్తే రూ.5 వేల కోట్లు అవుతుందా..? 

2019 లెక్కల ప్రకారం రూ.2,64,451 కోట్ల పూర్తి అప్పు ఉండగా.. 2023 నాటికి రూ.4,42,442 కోట్లు 

నాలుగేళ్ల పాలనలో రాష్ట్ర అప్పు కేవలం రూ.1,77,991 కోట్లు పెరిగింది

రూ.10 లక్షల కోట్లని ప్రచారం చేసినవారికి కేంద్రమంత్రి సమాధానం నచ్చడం లేదు

వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అంటే ప్రతిపక్షాలకు, ఎల్లో మీడియాకు గిట్టడం లేదు

చంద్రబాబు, లోకేష్‌ ఎందుకు జంతువులతో పోలుకుంటున్నారు..?

రాష్ట్ర అప్పులపై మాట్లాడేవారు ఎవ్వరూ కూడా ఏపీలో ఉండరు

చంద్రబాబు పాలనలో ఒక్కో సంవత్సరం ఏపీ అప్పు వార్షిక వృద్ధిరేటు 14.7 శాతం

వైయస్‌ జగన్‌ పాలనలో 12.4 శాతం మాత్రమే. ఇందులో రెండేళ్లు కోవిడ్‌ సమయం

ప్ర‌తిప‌క్షాల‌కు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ కౌంట‌ర్‌

సచివాలయం: ఆంధ్రప్రదేశ్‌ అప్పు గురించి ప్రతిపక్ష పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు, స్వయం ప్రకటిత ఆర్థిక నిపుణులు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, వైయస్‌ జగన్‌ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకరించకూడదనే దుర్బుద్ధితో అప్పులపై రకరకాల దుష్ప్రచారాలు, ఆరోపణలు ఫిర్యాదులు, వినతులు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. అప్పులపై ప్రతిపక్ష పార్టీల నేతల ప్రకటనలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వార్తలు, టీవీ డిబేట్లు చూస్తే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. ఏపీ అప్పుపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానాన్ని కూడా జీర్ణించుకోలేకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విషప్రచారానికి తెగబడుతున్నారని మండిపడ్డారు. వెయ్యి కోట్లను ఐదు సార్లు పత్రికల్లో రాసి దాన్ని రూ.5 వేల కోట్లుగా ప్రజలను నమ్మించాలనే తాపత్రయం క్లియర్‌గా కనిపిస్తుందన్నారు. గత నాలుగేళ్లుగా ఎప్పుడూ, ఎక్కడా కనిపించడని గంటా శ్రీనివాస్‌ కూడా అప్పుల గురించి మాట్లాడటం చూస్తే నవ్వొస్తుందన్నారు. సచివాలయంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఏపీ అప్పులపై పార్లమెంట్‌లో ప్రశ్న వేస్తే.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ చాలా క్లియర్‌గా సమాధానం చెప్పారు. 2023 జూలై నాటికి ఏపీ అప్పు రూ.4,42,442 కోట్లు అని చెప్పారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సమాధానం విని వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం అంటే గిట్టనివారు చాలా బాధపడ్డారు. ఏపీ అప్పు రూ.10 లక్షల కోట్లు అని చెప్పినవారంతా ఆ సమాధానాన్ని జీర్ణించుకోలేకపోయారు. 

మిలియన్‌ డాలర్‌ క్వశ్చన్‌ ఏంటంటే.. ఈ రెండు మూడు సంవత్సరాల్లోనే ఎల్లో మీడియాకు, ప్రతిపక్ష పార్టీ నేతలకు, స్వయం ప్రకటిత ఆర్థిక నిపుణులకు రాష్ట్ర అప్పుల గురించి గుర్తకు వచ్చిందా..? గత ఐదేళ్ల టీడీపీ పాలన గురించి, అంతకుముందు 10 ఏళ్లు, 15 ఏళ్లు ఎవ్వరూ మాట్లాడలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అప్పు గురించి రకరకాలుగా మాట్లాడటం, కేంద్రానికి ఫిర్యాదులు, వినతిపత్రాలు. వీరి ఉద్దేశం ఏంటంటే.. ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం సహకరించవద్దనే ఆలోచనతోనే ఇవన్నీ చేస్తున్నారు. 

ఏపీ అప్పుపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చిన సమాధానాన్ని నమ్మరు.. కానీ, కొత్తగా పదవి చేపట్టిన బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడితే ఫుల్‌ కవరేజ్‌ చేస్తారు. కేంద్ర సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి ఇచ్చిన సమాధానాన్ని ఎవరూ నమ్మరు, రాయరు. కానీ, బీజేపీలో కార్యదర్శి స్థాయిలో ఉన్న సత్యకుమార్‌ మాట్లాడితే దానికి ఫుల్‌ కవరేజ్‌. ఆర్బీఐ ఏదైనా డాక్యుమెంట్‌ ఇస్తే దాన్నీ నమ్మరు. స్వయం ప్రకటిత ఆర్థిక నిపుణుల వార్త మాత్రం ఫుల్‌ కవరేజీ. సీఏజీ, పీఏజీ రిపోర్టులను నమ్మరు.. కానీ, నిపుణుల అని చెప్పుకునేవారి ప్రకటనను ఫుల్‌గా కవరేజీ చేస్తారు. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని నిందించాలనే ఆలోచనతో ఉన్నవారికి వాస్తవాలు, రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలమైన సమాధానం వస్తే గిట్టదు, నచ్చదు. పీఏజీ తప్పు, ఆర్బీఐ ఎందుకు అంటారు, ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చిన రిపోర్టును కూడా తప్పుబడతారు. చివరకు ఏబీఎన్‌ ఛానల్‌ డిబేట్‌లో వెంకట కృష్ణకు కూడా అప్పులు, సమాధానాలపై సందేహం వచ్చింది. మళ్లీ మరుసటి రోజు యధావిధిగా దుష్ప్రచారం మొదలుపెడతారు. 

అసలు వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అంటే ప్రతిపక్షానికి, ఎల్లో మీడియాకు గిట్టడం లేదు. ఫస్ట్‌ రోజు మీరు పరిపాలన చేయలేరు అన్నారు.. రెండో రోజు చేయాల్సిన అప్పు అంతా మేమే చేశామని నిసిగ్గుగా చెప్పేశారు. మొదటి సంవత్సరం గడిచిన తరువాత ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేరన్నారు.. పరిపాలన ఎలా జరుగుతుందో అర్థంగాక మూడేళ్ల తరువాత ప్రభుత్వం విపరీతంగా అప్పు చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వమేమో ఏపీ అప్పు పరిమితిలోనే ఉందని చెబుతుంది. 

29 రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటి. మనకు సపరేట్‌ రూల్స్‌ ఉంటాయా..? అందరికీ వర్తించే రూల్స్‌ మన రాష్ట్రానికి వర్తిస్తాయి. 

తరువాత కోవిడ్‌ సమయంలో మీరు జీతాలు ఇవ్వలేరని అన్నారు. రెండు మూడు రోజులు ఆలస్యమైనా తరువాత అంతా సర్దుకుంది. ఆ తరువాత మళ్లీ రాష్ట్రం శ్రీలంక మాదిరిగా తయారవుతుందని ఆరోపణలు చేశారు. శ్రీలంక దేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా సంబంధం ఉందా..? దేశానికి, రాష్ట్రానికి సంబంధించిన విధానాలు వేర్వేరు ఉంటాయని తెలియదా..? భారతదేశానికి అప్పు కావాలంటే ఎక్కడైనా చేసుకోవచ్చు, నోట్ల ప్రింటింగ్‌ కూడా నిబంధనలకు లోబడి చేసుకోవచ్చు. రాష్ట్రానికి, దేశానికి ఎక్కడైనా పోలిక ఉంటుందా..? 

ఏపీ అప్పులపై ఫిర్యాదులు, వినతులు, అపవాదులు, ఆరోపణలు చేసేవారిలో  ఎవ్వరికీ ఆంధ్రప్రదేశ్‌లో నివాసం కూడా లేరు. మీడియా సంస్థల యజమానులు, ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులు అందరూ కేరాఫ్‌ హైదరాబాద్‌. వారి వ్యాపారాలు హైదరాబాద్‌లోనే ఉంటాయి కానీ, ఉదయం లేచింది మొదలు ఏపీ రాజకీయాలపై ఆరోపణలు చేస్తున్నారు. 

వెయ్యి కోట్ల అప్పు కోసం ఢిల్లీకి, అప్పుకు ఇంకా ఢిల్లీ అనుమతించలేదు, వెయ్యి కోట్ల అప్పు ఆర్బీఐ నుంచి వస్తుంది.. అంటే ఒక వెయ్యి కోట్లను ఐదు సార్లు చెబితే రూ.5000 కోట్లుగా ప్రజలకు కనిపిస్తుందని వీరి ప్రీప్లాన్డ్‌ కుట్ర. 

చంద్రబాబు తాట తీస్తా అని మాట్లాడుతున్నాడు. కొత్తగా నేను సింహాన్ని, కొదమ సింహాన్ని అంటున్నాడు. ఆయన పుత్రుడు మేము సింహాలం అంటున్నాడు. మీరు జంతువులతో పోల్చుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు. 

ఇదిలా ఉంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారు, స్వయం ప్రకటిత ఆర్థిక మేధావులు ఒకరు రూ.10 లక్షల కోట్లు, మరొకరు రూ.11 లక్షల కోట్లు, ఇంకొకరు రూ.7 లక్షల కోట్ల అప్పు అంటున్నారు. అంతా కలిసే ఉన్నారు కదా.. ఏదో ఒక ఫిగర్‌ ఫిక్స్‌ అయ్యి ఆరోపణలు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. తెలియనివారు ఎవరైనా అప్పుల గురించి మాట్లాడితే అవగాహన లేదని ప్రజలు అర్థం చేసుకొని క్షమిస్తారు. కానీ చంద్రబాబు రాజకీయాలకు కొత్తవ్యక్తి కాదు కదా.. కొత్తగా వచ్చి నీనేదో చేస్తానని చెప్పుకోవడానికి లేదు, మూడు దఫాలుగా ఆయన రికార్డు చూసుకోవచ్చు. 

1995 వరకు జరిగిన అప్పుల గురించి చెప్తాను. చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది.. సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలన ఎలా ఉందో.. ఈ రెండే కాకుండా ఇతర రాష్ట్రాలతో, దేశంతో పోలిక చూసుకుందాం. 

రూ.10 లక్షల కోట్ల అప్పు అని ఆరోపణలు చేస్తున్నారు. కానీ, 2023 జూలై 31వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఏమన్నారంటే.. 2019 లెక్కల ప్రకారం రూ.2,64,451 కోట్లు ఏపీ పూర్తి అప్పు ఉండగా.. 2023 నాటికి రూ.4,42,442 కోట్లు అని చెప్పారు. అంటే మొత్తం మీద ఈ నాలుగు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అప్పు రూ.1,77,991 కోట్లు పెరిగింది. ప్రభుత్వంపై బురదజల్లే ప్రతిపక్ష పార్టీలు, నిపుణులు, మీడియా సంస్థలు అన్నట్టుగా ఏపీ అప్పు ఈ నాలుగేళ్లలో రూ.10 లక్షల కోట్లు కాదు.. కేవలం రూ.1,77,991 కోట్లు. 

2014–15 నుంచి 2018–19 ఐదేళ్ల పాటు రాష్ట్ర అప్పు వార్షిక వృద్ధి రేటు.. 
2014–15 నుంచి 2018–19 వరకు 14.7 శాతం పెరిగింది. చంద్రబాబు పాలనలో ఒక్కో సంవత్సరం ఏపీ అప్పు 14.7 శాతం పెరిగితే.. 2019–20 నుంచి 2022–23 వరకు వైయస్‌ జగన్‌ పాలనలో 12.4 శాతం మాత్రమే. ఇందులో రెండు సంవత్సరాలు కోవిడ్‌ సమయం ఉంది. 

ఆర్థిక లోటు ఒక‌సారి గ‌మ‌నిస్తే..2014–15 నుంచి 2018–19 ఐదేళ్ల చంద్రబాబు పాలనలో చూస్తే.. దేశ రెవెన్యూ లోటు సగటు 2.5 శాతం ఉండగా.. ఏపీ రెవెన్యూ లోటు రూ.2.4 శాతం ఉంది. 

Back to Top