క‌లెక్ట‌రేట్ ఎదుట ధాన్యం ట్రాక్ట‌ర్ల‌తో రైతుల ధ‌ర్నా

 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:  ధాన్యం కొనుగోలులో ప్ర‌భుత్వ అల‌స‌త్వాన్ని నిర‌సిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో 30 ట్రాక్ట‌ర్ల‌తో ధాన్యం బ‌స్తాల‌తో ధ‌ర్నా నిర్వ‌హించారు. అమలాపురం పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధాన్యం రైతుల వినూత్న నిరసన చేప‌ట్టారు. 30 ట్రాక్టర్లలో ధాన్యం బస్తాలను తీసుకొచ్చిన‌ అయినవిల్లి మండలానికి చెందిన రైతులు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంద‌ర్భంగా  పార్టీ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, మండల అధ్య‌క్షుడు కుడుపూడి విద్యాసాగర్, చేట్ల రామారావు, గుమ్మడి ప్రసాద్, మిండగుదిటి రాంబాబు తదితరులు ప్ర‌భుత్వ ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌ట్టారు. `ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతిపై ఉన్న ప్రేమ రాష్ట్రంలో అష్ట కష్టాలు పడుతున్న అన్నదాతలపై లేదు. రబీ ధాన్యం అమ్ముకునే దిక్కులేక రైతులు పడుతున్న అవస్థలను చూసైనా ఆయన మొద్దు నిద్ర వీడాలి. లేకుంటే వైయ‌స్ఆర్‌ సీపీ కూటమి ప్రభుత్వం మెడలు వంచి ధాన్యం కొనిపిస్తుంది. అవినీతిని, అక్రమాలను ప్రశ్నిస్తానని చెప్పుకొనే ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కూడా ధాన్యం కొనుగోళ్ల విషయంలో పత్తా లేకుండా పోయారు. పవన్‌కళ్యాణ్‌ను చంద్రబాబు బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడని జన సైనికుల అంటున్న క్రమంలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయన ప్రశ్నించేలా లేరు` అంటూ వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు హెచ్చ‌రించారు.
 

Back to Top