పుట్టపర్తి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయాన్ని పండుగ చేశారని రైతు రమేష్ తెలిపారు. రైతులకు మేలు చేసిన వైయస్ జగన్‌ను గుండెల్లో పదిలంగా దాచుకుంటామని రైతు పేర్కొన్నారు. రైతు భరోసా సాయాన్ని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సీఎం వైయస్ జగన్ బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో గాజులపల్లి రైతు రమేష్ మాట్లాడారు. రైతు రమేష్ ఏమన్నారంటే.. అందరికీ నమస్కారం, మా రైతన్నలందరి తరపునా నమస్కారాలు, నేను, మా కుటుంబం గత నాలుగున్నర ఏళ్లుగా పొందిన లబ్ధి గురించి చెప్పాలని వచ్చాను, గతంలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారు కానీ దేశానికి పట్టుకొమ్మ రైతన్న, దేశానికి వెన్నెముక రైతన్న అని ఉచిత విద్యుత్‌పై సంతకం చేసిన మహానుభావుడు వైయస్‌ఆర్ గారు, ఆయన తనయుడిగా మీరు తండ్రికి తగ్గ తనయుడిలా పాదయాత్రలో ప్రజల గుండె చప్పుడు విని రైతులకు సంబంధించి అనేక పథకాలు అందించిన ఘనత మీది, గతంలో చంద్రబాబు రుణమాఫీ చేస్తానని మధ్యలో చేతులెత్తేశాడు దాంతో అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, వారిని ఓదార్చడానికి మీరు రైతు ఓదార్పుయాత్ర నిర్వహించి, మా పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రారంభించారు, నేను ఒక రైతుగా చెబుతున్నాను, నాకు రైతు భరోసా సాయం అందింది, నా పొలం ఎన్నో ఏళ్ళు బీడుగా ఉంచాను, ఆర్ధిక సమస్యల వల్ల సాగు చేయలేదు, మాకు రైతు భరోసా సాయంతో పాటు సున్నావడ్డీ రుణాలు, ఉచిత పంటల బీమా మేం లబ్ధి పొందాం, మా రాష్ట్రంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని మీరు ఆలోచించి ఆర్బీకేలు తీసుకొచ్చారు, దీని వల్ల చాలా ఉపయోగం ఉంది, నాణ్యమైన విత్తనాలు, మందులు అందుతున్నాయి, పండుతున్న పంటలకు మార్కెట్‌లో ధర ఎంత ఉందో కూడా తెలుసుకుంటున్నాం, పొలంబడి ద్వారా రైతన్నలకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఏ విధంగా చేసుకోవాలనే దానిపై మెలుకువలు నేర్పుతున్నారు. గతంలో పంట నష్టపరిహారం తెలిసేది కాదు కానీ ఇప్పుడు సీజన్ ముగిసేలోగా నష్టపరిహారం ఇస్తున్నారు, మా అమ్మకు పెన్షన్ రూ. 90,000 వచ్చింది, గతంలో పెన్షన్ తీసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉండేవి, కానీ ఈ రోజు వలంటీర్ ఉదయాన్నే వచ్చి పెన్షన్ ఇస్తున్నారు, మా కుటుంబంలో రూ. 28,000 అమ్మ ఒడి లబ్ధి జరిగింది, మీ వల్ల మారుమూల ప్రాంతంలోని పేద విద్యార్ధి ఐక్యరాజ్యసమితిలో కూర్చోగలిగాడు, మాకు వైఎస్సార్ చేయూత ద్వారా రూ. 56,250 లబ్ధి జరిగింది, మొత్తం కలిపి రూ. 2,52,000 లబ్ధి జరిగింది, నేను ఒక రైతన్నగా చెబుతున్నా జగనన్న మన పిల్లలకు మామయ్యలా ఆడపడుచులకు అన్నగా అవ్వాతాతలకు మనవడిగా అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు, అందుకు మనమంతా జగనన్నను దీవించాలి, మన జగనన్న వ్యవసాయాన్ని పండుగ చేశారు, మిమ్మల్ని మా గుండెల్లో పదిలంగా దాచుకుంటాం, ధన్యవాదాలు.