పోల‌వ‌రం ఎత్తు త‌గ్గిస్తే ప్రాజెక్టు సామ‌ర్థ్యం త‌గ్గుతుంది

వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్‌

రాజ‌మండ్రి: పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడం ద్వారా ఆ ప్రాజెక్టు సామర్థ్యం తగ్గిపోతుంద‌ని, దానివల్ల రైతులకు న‌ష్టం క‌లుగుతుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ పేర్కొన్నారు.  ఉత్తరాంధ్రకు కూడా నీరు ఇవ్వలేని పరిస్థితి ఎదురవుతుంద‌న్నారు. కేంద్రంతో పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదన మార్గాని భరత్ ప్ర‌శ్నించారు. గ‌తంలో కూడా చంద్ర‌బాబు త‌న స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం ప్రత్యేక‌హోదాను తాక‌ట్టు పెట్టార‌ని, పోల‌వ‌రాన్ని ఏటీఎంలా వాడుకున్నార‌ని స్వ‌యాన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోదీ అన్న‌ట్లు గుర్తు చేశారు.  
పోలవరం ప్రాజెక్టు ఎత్తును పరిమితంచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా మీరు ఎందుకు నోరుమెదపడంలేద‌న్నారు. ఎత్తు త‌గ్గిస్తే ప్రాజెక్టు లక్ష్యాలనే దెబ్బతీస్తున్నారు కదా? దేనికి లాలూచీపడి మీరు ఈ పనికి ఒడిగట్టారు? ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, కేంద్ర మంత్రివర్గంలో మీ పార్టీ ఎంపీలు కూడా ఉండి ఎందుకు ఈ అంశంపై అభ్యంతరం చెప్పలేద‌న్నారు. చంద్రబాబుకు ఎప్పుడు ప్రజలు అధికారాన్ని అప్పగించినా రాష్ట్ర భవిష్యత్తును, ప్రజల భవిష్యత్తును తాకట్టుపెడతారని, మీ స్వార్థరాజకీయాలకు, ఆర్థిక, వ్యక్తిగత ప్రయోజనాలకోసం ప్రజల ప్రయోజనాలను నట్టేటా ముంచేస్తారా అని భ‌ర‌త్ నిల‌దీశారు.

Back to Top