అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం

 నష్టపోయిన ప్రతి రైతును సీఎం వైయ‌స్ జగన్ ఆదుకుంటారు

 కేంద్ర ప్రభుత్వం స్పందించి ఉదారంగా సాయం చేయాలి

 క్షేత్రస్థాయిలో పంట నష్టం పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి 

ఉరవకొండ: వర్షాల కారణంగా పంట నష్టపోయిన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదని ఉరవకొండ వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఒక్క సెంటు పంట నష్టపోయినా ఆదుకుంటామన్నారు.  గురువారం విడపనకల్లు మండలం కొట్టాలపల్లి, మాలాపురం, విడపనకల్, ఆర్. కొట్టాల, కడదరబెంచి, డోనేకల్లు, గడేకల్లు, పెంచలపాడు తదితర గ్రామాల్లో పంట నష్టాన్ని అంచనా వేసేందుకు జిల్లా అగ్రి అడ్వైజరి బోర్డు చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రమణ, వ్యవసాయ శాఖ ఏడీఏ పద్మజ, తహశీల్దార్ రజాక్ వలి, ఎంపిడిఓ శ్రీనివాసులు, డిడిఏ ఇంచార్జ్ విద్యావతి, హెచ్ఓ నెట్టికంటయ్య, ఏవో మధుమతి,వైస్సార్సీపీ  నాయకులు ,రైతులతో కలిసి విశ్వేశ్వరరెడ్డి క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులను కలుసుకున్నారు. పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులను ఓదార్చారు.వ్యవసాయ అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు రైతుల కష్టాన్ని తెలుసుకునేందుకు వారిని ఆదుకునేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. వాయుగుండం కారణంగా కురిసిన వర్షాలకు పంటలకు తీవ్ర నష్టం జరగడం బాధాకరమన్నారు.నియోజకవర్గంలో అంచనాలకు అందని విదంగా రైతన్నకు అపార నష్టం వాటిల్లిందని వాపోయారు. ప్రాధమిక అంచనా ప్రకారం 30 వేల ఎకరాల్లో పంటలు భారీగా దెబ్బతిన్నాయన్నారు. ముఖ్యంగా పప్పుశనగ,మిరప, వరి పంట వేసిన రైతులకు పెట్టుబడి సైతం రాని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. కనీసం పశువులకు మేత కూడా మిగలని పరిస్థితి నెలకొందన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు కృషి చేస్తామని మాజీ ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కష్ట సమయంలో రైతులకు సాయం చేయడానికి సీఎం జగన్ ఎప్పుడు ఉదారంగా ఉంటారని అన్నారు.అధైర్య పడొద్దని చెప్పారు. రైతులకు ఏమైన ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేందుకు ఉదారంగా సాయం చేయాలని కోరారు. ఇప్పుడు జరిగిన నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే అడ్డుకోవాలంటే తలకు మించిన భారమవుతుందన్నారు.కాబట్టి సీఎం జగన్ కోరిన విదంగా ప్రధాని మోదీ తక్షణ సాయం కింద వెయ్యి కోట్లు విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో  జెడ్పిటిసి హనుమంతు, మండల అగ్రి బోర్డు చైర్మన్ భీమరెడ్డి, వైస్సార్సీపీ నాయకులు భరత్ రెడ్డి, బసన్న, మాజీ జెడ్పిటిసి తిప్పయ్య, కరణం భీమరెడ్డి, పొంపాపతి,గోపాలకృష్ణ, డోనేకల్లు రమేష్, జయరామ్, సుంకన్న, హంపయ్య, సర్పంచ్ లు జయసింహ, రామాంజనేయులురెడ్డి, మోదుగుపల్లి రామాంజనేయులు,ప్రకాష్ గౌడ్, దేవరాజు, ఉమాశంకర్, హేమవతి,డిష్ వెంకటేష్, పెద్దన్న, శ్రీరాములు, అయ్యపు రెడ్డి,కేసన్న, భీంరావు, మస్తాన్, విడపనకల్ సొసైటీ చైర్మన్ శ్రీరాములు, ఎంపీటీసీ తిమ్మరాజు, కో అప్షన్ సభ్యుడు లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top