వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లో ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నారు

వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు వై.విశ్వేశ్వ‌ర‌రెడ్డి 

అనంత‌పురం: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌రిపాల‌న‌లో ప్ర‌జ‌లంతా సంతోషంగా ఉన్నార‌ని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు  వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో శుక్రవారం ఉరవకొండ మండలం మూలగిరిపల్లి గ్రామంలో "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమం జరిగింది. ఇందులో ఎంపిపి చందా చంద్రమ్మ, వైస్ ఎంపిపి నరసింహులు, జెడ్పిటిసి పార్వతమ్మ, సర్పంచ్  శ్రీరాములు, ఎంపీటీసీ ఓబయ్య, ఆమిద్యాల పిఏసీఎస్ చైర్మన్ తేజోనాత్,ఉప సర్పంచ్ వెంకట రెడ్డి ఉరవకొండ పిఏసీఎస్ చైర్మన్ షేక్షావలి, పెన్నహోబిలం చైర్మన్ అశోక్ కుమార్, నాయకులు ఓబన్న,తహశీల్దార్ మునివేలు, ఎంపీడీఓ అమృత రాజు, ఈఓఆర్డీ దామోదర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా ప్రభుత్వం నుంచి ప్రజలకు అందిన పథకాలను లబ్ధిదారులకు విశ్వేశ్వరరెడ్డి వివరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే వీటిని పరిష్కారం చేయాలని వెంట వచ్చిన అధికారులకు ఆయన ఆదేశించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాలనలో తమకు జరిగిన మంచికి కృతజ్ఞతగా గడప గడపలో మాజీ ఎమ్మెల్యే తో కలిసి సీఎం వైయ‌స్ జగన్ చిత్రపటానికి క్షిరాభిషేకం" చేశారు. అనంతరం విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కులం, మతం పార్టీ చూడకుండా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందే విధంగా వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా వాలంటీర్ల ద్వారా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తుంటే చంద్రబాబు, లోకేశ్ ఓర్వడం లేదని విమర్శించారు. తన అనుకూల మీడియా ద్వారా ప్రతి దాన్ని వక్రీకరిస్తున్నారని చెప్పారు.వీరికి ప్రజలు మరోసారి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.  మూలగిరిపల్లి గ్రామంలో నెలకొన్న త్రాగునీటి సమస్యను ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 20 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఆయన ఇచ్చారు. శ్మశానవాటికకు స్థలం కేటాయించాలని గ్రామస్తులు కోరగా అక్కడే ఉన్న తహశీల్దార్ తో మాట్లాడారు. ఎకరా స్థలం కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఆమిద్యాల రాజేష్,మండల అగ్రి అడ్వైజరి బోర్డు చైర్మన్ వెంకటేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకన్న,మూలాగిరిపల్లి గ్రామస్తులు సునీల్, బసవరాజు, రామాంజనేయులు, నారాయణ స్వామి, ఓబులేసు, శెట్టి బలిజ రామాంజనేయులు, సంగమేష్, ఎంబిసి డైరెక్టర్ జోగి వెంకటేష్, ఉరవకొండ ఉప సర్పంచ్ వన్నప్ప,వార్డు సభ్యుడు మల్లికార్జున, మాజీ ఎంపీపీ ఏసీ ఎర్రిస్వామి, మాజీ జెడ్పిటిసి తిప్పయ్య, పిఏసీఎస్ డైరెక్టర్ ప్రసాద్, పచ్చి రవి, ముద్దాలపురం రాజు ,మల్లికార్జున, వేమన్న, అయ్యర్ దాదు, ఎర్రిస్వామి రెడ్డి,ప్రకాష్, ముండస్ ఓబులేసు, ఉదిరిపికొండ రామ్మోహన్,ఆమిద్యాల మల్లప్ప, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

Back to Top