నా కుటుంబంలోకి వచ్చినట్లుగా ఉంది

మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో వలసల పర్వం కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, గురురాఘవేంద్ర సంస్థల చైర్మన్‌ దస్తగిరి రెడ్డి వైయస్‌ఆర్‌ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ నివాసంలో కలిసిన లబ్బి వెంకటస్వామి, దస్తగిరిరెడ్డిలు జననేత సమక్షంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ మేరకు లబ్బి వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. దళితులు, బడుగు, బలహీనవర్గాలను చంద్రబాబు రాజకీయంగా అణగదొక్కుతున్నారన్నారు. నియంతృత్వ పోకడ జరుగుతుందని, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి నందికోట్కూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్న తనను తప్పించి గౌరు వెంకటరెడ్డికి సంబంధించిన వారికి ఇచ్చారని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ నేతృత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని, వైయస్‌ఆర్‌ సీపీలోకి వస్తే నా కుటుంబంలోకి నేను వచ్చినట్లుగా ఉందన్నారు. 

 

Back to Top