అధికారం కోసం ఎంతటి అబద్ధమైనా చెప్తారా?

మాజీ మంత్రి ఆర్కే రోజా 

చిత్తూరు జిల్లా:  అధికారం కోసం ఎంతటి అబద్ధమైనా చెప్తారా? అని మాజీ మంత్రి ఆర్కే రోజా నిల‌దీశారు. కూటమి సర్కార్‌ తప్పుడు ప్రచారంపై ఎక్స్ వేదిక‌గా మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా కూటమి నేతల దుష్ప్రచారం బట్టబయలైందంటూ ఆమె ట్వీట్‌ చేశారు. మిస్సింగ్‌ కేసుల్లో 99.5 శాతానికిపైగా మహిళలను గత ప్రభుత్వంలోనే గుర్తించారని కేంద్ర హోంశాఖ కూడా పార్లమెంట్‌లో స్పష్టం చేసింది. ఇప్పటికైనా పవన్‌ కల్యాణ్‌ ఆత్మ విమర్శ చేసుకోవాలి. అధికారం కోసం ఎంతటి అబద్ధమైనా చెప్తారా?’’ అంటూ ఆర్కే రోజా ట్వీట్ చేశారు. 

Image

Back to Top