వరదల్లో చంద్రబాబు అనైతిక బురద రాజకీయాలు

మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) 

పోలవరం ముంపు మండలాలపై మొసలి కన్నీరు

వరద బాధితులను ఓదార్చకుండా ఓట్ల రాజకీయాలు

పోలవరం జిల్లా చేస్తానంటూ హామీలు. ప్రకటనలు

ఇదే చంద్రబాబు గతి తప్పిన దిగజారిన రాజకీయం

మాజీ మంత్రి  పేర్ని వెంకట్రామయ్య స్పష్టీకరణ

సీఎంగా ఏనాడూ ఆ ప్రాంతాలను పట్టించుకోలేదు

ఏ ఒక్కరోజు కూడా ఆ ప్రాంతంలో అడుగు పెట్టలేదు

అప్పటి ఉభయ గోదావరి జిల్లాల మంత్రులూ రాలేదు

వారి సమస్యలు అడిగి తెలుసుకోలేదు. ఆరా తీయలేదు

గుర్తు చేసిన మాజీ మంత్రి  పేర్ని నాని

గోదావరికి 1996లోనూ భారీ వరదలు వచ్చాయి

మరి ఆనాడెందుకు ఈ ప్రాంతానికి రాలేదు? 

సూటిగా ప్రశ్నించిన మాజీ మంత్రి  పేర్ని నాని

వరదల్లో హెలికాప్టర్లలో తిరుగుతూ చక్కగా తిన్నారు

కనీసం కిందకు చూడను కూడా చూడలేదు

పక్కనే అధికారులతో వివరాలు ఆరా తీయలేదు

అలాంటి మీరు ఇవాళ వైయ‌స్ జగన్‌గారిపై విమర్శలు చేస్తున్నారు

జగన్‌గారు వరద బాధితులను స్వయంగా కలిశారు

ఆయనను విమర్శించే నైతిక హక్కు మీకు లేదు

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన మాజీ మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం: వరదల్లో చంద్రబాబు అనైతిక బురద రాజకీయాలు చేస్తున్నార‌ని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిప‌డ్డారు. శుక్ర‌వారం మచిలీపట్నం ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌజ్‌లో మాజీ మంత్రి  పేర్ని వెంకట్రామయ్య (నాని) మీడియాతో మాట్లాడారు. 

ఈ రోజు చంద్రబాబుగారు గోదావరి ముంపు ప్రాంతమైన ఎటపాక మండలంలో పర్యటిస్తూ, వరద బాధితులను ఓదార్చడం సంగతి దేవుడెరుగు. వరద బురదలో రాజకీయాలు చేస్తున్నారు. చిత్తశుద్థితో ఒక్క మాట కూడా సానుభూతిగా మాట్లాడడం లేదు. అది ఆయన దిగజారిన రాజకీయానికి అద్దం పడుతోంది.
    పోలవరం ముంపు ప్రాంతాలు.. చింతూరు, ఎటపాక, వీఆర్‌పురం, అటువైపు ఉన్న నాలుగు మండలాలు.. ఇటు ఏలూరు జిల్లాలో ఉన్న రెండు మండలాలు కుక్కునూరు, వేలేరుపాడు కలిపి ఒక జిల్లా చేస్తానంటున్నాడు. అంటే 2024లో ఆయన సీఎం అయితే, ఆ జిల్లా ఏర్పాటు చేస్తాడట.
ఎటపాక నుంచి ఇవాళ జిల్లా కేంద్రం అయిన పాడేరు వెళ్లాలంటే 385 కి.మీ అవుతుంది కాబట్టి, హైదరాబాద్‌కు సులభంగా పోవచ్చు. కాబట్టి తాను సీఎం కాగానే పోలవరం జిల్లా చేస్తానంటున్నాడు.

మతి భ్రమించిందా?:
    మరి 2014 నుంచి 2019 వరకు సీఎంగా ఉన్నది ఎవరు? అప్పుడు ఎవరి ప్రభుత్వం ఉంది? పోలవరం ముంపు ప్రాంతమైన ఎటపాక ఏ జిల్లాలో ఉంది. అది కాకినాడ జిల్లాలో ఉంది. అది ఎంత దూరం? చంద్రబాబుకు మతి భ్రమించిందా? 

హెలికాప్టర్‌లో ఏం చేశారు?:
    సీఎంగారి పర్యటన కోసం ఇన్ని హెలిపాడ్‌లు అవసరమా? అంటున్న చంద్రబాబు, మరి ఆరోజు ఎలా పర్యటించారు? ఒకసారి చూడండి.. అంటూ ఒక ఫోటో చూపారు.
‘కింద ప్రజలు వరదల్లో ఉంటే, చక్కగా హెలికాప్టర్‌లో కూర్చున్న చంద్రబాబు టిఫిన్‌ చేస్తున్నాడు. అదే సీఎం శ్రీ వైయస్‌ జగన్, పేపర్లు ముందు వేసుకుని సమీక్షించారు’.
ఆ తర్వాత మరో వీడియోను కూడా శ్రీ పేర్ని నాని చూపారు.
    ‘ఇదీ చంద్రబాబు బాగోతం. వరద పీడిత ప్రాంతాల్లో హెలికాప్టర్‌లో పర్యటించిన చంద్రబాబు, అసలు బాధితులను చూడకుండా ఎలా వ్యవహరించాడో చూడండి. ఆయన చేతిలో కనీసం పేపర్‌ కూడా లేదు. పక్కనే ఉన్న ఒక ఆఫీసర్‌తో కూడా మాట్లాడలేదు. హాయిగా తింటూ కూర్చున్నాడు. అంటే గిన్నెలు గిన్నెలు తినడానికి హెలికాప్టర్‌ ఎక్కాడు. ఇదీ చంద్రబాబు పని’.

చంద్రబాబును మించిన నటుడెవరు?:
    ఇన్ని తంతులు చేసిన చంద్రబాబు, అధికారం పోగానే ఏం మాట్లాడుతున్నాడు. జగన్‌గారిని విమర్శిస్తున్నాడు. ఆయన పిల్లలను ఎత్తుకుంటున్నాడని, వారికి పెన్నులు ఇస్తున్నారని, బాధితులతో సెల్ఫీలు దిగుతున్నారని ఏదేదో మాట్లాడుతున్నారు.
    కానీ నిజానికి చంద్రబాబును మించిన నటులు ఎవరు? ఆయనను మించిన నటుడు మరెవరూ లేరు. చివరకు ఆయనకు పిల్లనిచ్చిన ఎన్టీ రామారావు కూడా అన్నారు. తనను మించిన నటుడు చంద్రబాబు అని.

‘నారా గజనీ’:
    ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు ఒక గజనీ. గతంలో తాను చేసినవన్నీ మర్చిపోయాడు. ఆయనకు సరైన పేరు ‘నారా గజనీ’.
    1996లో వరదలు వస్తే ఎటపాక మునిగిపోతే, అప్పుడు ఎందుకు అక్కడికి పోలేదు. అప్పుడు చంద్రబాబే సీఎం కదా? అయినా ఎందుకు అక్కడికి పోలేదు?.అన్నీ గజనీ మాటలు. ఎవరికి ఏదీ గుర్తుండదు అనుకుంటాడు. నిన్న 1986 వరదలను ప్రస్తావించాడు. మరి 1996 వరదల గురించి ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు కూడా దాదాపు ఇదే స్థాయిలో వరద వచ్చింది కదా? అప్పుడు పోలవరం లేదు కదా? అయినా ఇలాగే ఊళ్లన్నీ మునిగిపోయాయి కదా? 
    అప్పుడు మీరే ఇల్లిల్లూ తిరిగి, చీపురు చేటతో కడిగావా? బురద ఎత్తిపోశావా? కనీసం రాను కూడా రాలేదు కదా? ఇవన్నీ అందరూ మర్చిపోయారు అనుకుంటున్నావా?

జీఓలు తప్ప ఏం ఇచ్చావు?:
    1996 వరదల్లో కనీసం ముఖం కూడా చూపించలేదు కదా? పోనీ 2014–19 మధ్యలో ఒకసారైనా అక్కడికి వెళ్లావా? 
    జగన్‌గారు ఇంటింటికీ రూ.2 వేలు ఇచ్చారు. కానీ నీవు ఏనాడైనా జీఓలు ఇవ్వడం తప్ప, ఎప్పుడైనా డబ్బులు ఇచ్చావా?. హుద్‌హుద్, తిత్లీ తుపాన్‌లు వస్తే, జీవోలు ఇవ్వడం తప్ప, కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
    తిత్లి తుపాన్‌ వస్తే, అమరావతి నుంచి హెలికాప్టర్‌లో శ్రీకాకుళం వెళ్లిన నీవు, అక్కడ ఏసీ బస్సు ఎక్కి పర్యటించావు. జనం తిడితే కనీసం బస్సు నుంచి కూడా దిగలేదు. మంచినీరు కూడా ఇవ్వలేదని జనం తిట్టారు. జనం తరిమికొడితే, స్థానిక అధికార పార్టీ ఎంపీ పారిపోయాడు. అదీ మీ పనితీరు. అలాంటి మీరు ఇవాళ నీతులు చెబుతున్నారు.
    మీరు 2016, 2017, 2018లో జీఓలు  మాత్రమే ఇచ్చారు. ఏనాడూ ఆదుకోలేదు. అదీ మీ దిక్కుమాలిన పాలన. నిజానికి జగన్‌గారు ఆదుకుంటున్నారు. తక్షణమే సహాయం చేస్తున్నారు.

ఆ 5 ఏళ్లలో ఒక్కసారైనా..:
    మీరు అంటున్నారు పిడుగులు పడే కూనవరం, వీఆర్‌ పురం, చింతూరు, ఎటపాక కానీ.. లేదా ఇటు వైపు ఉన్న వేలేరుపాడు, కుకునూరు.. ఈ ఆరు మండలాలతో పాటు, బూర్గుంపాడులోని కొన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. కానీ ఏనాడైనా మీరు రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2019 వరకు ఏనాడైనా అక్కడికి వెళ్లారా? కనీసం వాటి ముఖం చూశారా? అక్కడ కాలు పెట్టారా?
    మీరు పోలేదు. కనీసం మీ మంత్రుల్లో ఒకరైనా అక్కడికి వెళ్లారా? ఇవాళ ఎటపాక గురించి మాట్లాడుతున్నావు. మీ మంత్రుల్లో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు ఎవరైనా వెళ్లారా? పోలవరం కడితే మీ బాధలు ఏమిటని అడిగారా?
    ఈయన అంటాడు 1986లో వరదలు వచ్చినప్పుడు తాను తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా వచ్చానని. మరి 1996లో కూడా అదే స్థాయిలో వరదలు వచ్చాయి. మరి అప్పుడు సీఎంగా ఉన్నారు. కానీ ఎందుకు పర్యటించలేదు? ఇక్కడి వారిని ఎందుకు పరామర్శించలేదు?
    అలాంటి నీవు ఇవాళ జగన్‌గారిని విమర్శిస్తున్నావు. హెలికాప్టర్‌లో తిరుగుతున్నారని ఆరోపిస్తున్నారు.

బురద రాజకీయాలు:
    ఇవాళ అక్కడి ప్రజలు వరదల్లో ఇబ్బందుల్లో ఉంటే, అధికారం ఇవ్వండి. జిల్లా చేస్తాను అంటున్నావు. మరి 2014 నుంచి 2019 వరకు నీవు కానీ, నీ కొడుకు కానీ, ఏనాడూ అక్కడికి ఎందుకు పోలేదు. ఇదే ఎటపాక వాసులు తమ జిల్లా కేంద్రం కాకినాడకు ఎలా వెళ్లారు? అది గుర్తుకు లేదా?
    ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే, వారిని పరామర్శించాల్సింది పోయి, ఓట్లు అడుక్కుంటున్నాడు. ఇంత దిక్కుమాలిన రాజకీయాలు ఎవరైనా చేస్తారా?. మాట్లాడితే 40 ఏళ్ల రాజకీయం. 14 ఏళ్ల సీఎం అంటావు. మరి ఏనాడైనా ఎటపాక వెళ్లావా? ఇవాళ వారిపై మొసలి కన్నీరు కారుస్తున్నావు.
పోలవరం కడితే, వేలేరుపాడు, ఎటపాక వాసుల పరిస్థితి ఏమిటన్నది ఒక్కసారైనా ఆరా తీశావా? 

ఇదేనా నీ రాజకీయం?:
    అందుకే ప్రజలంతా ఛీత్కరించుకుంటున్నారు. ఇలాంటి నాయకుడినా భరిస్తోంది అని అనుకుంటున్నారు. అందుకే చంద్రబాబు ఇకనైనా ఇలాంటి దిక్కుమాలిన బురద రాజకీయాలు మానుకోవాలి. అనవసర విమర్శలు వదలాలి.
 

Back to Top