పారదర్శకంగా టీచర్ల బదిలీల కౌన్సెలింగ్‌

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

విజయవాడ: ఉపాధ్యాయుల బ‌దిలీల‌ కౌన్సెలింగ్‌ను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉండాలనేది ప్రభుత్వ ధ్యేమయన్నారు. వివిధ కేటగిరీల్లో కొన్ని స్థానాలను బ్లాక్‌ చేయడం గతం నుంచి వస్తున్న విధానమేనన్నారు. కేటగిరీ 4లో కూడా కొన్ని స్థానాలను బ్లాక్‌ చేశామని చెప్పారు. అన్ని కేటగిరీల్లో బదిలీలకు 48,897 ఖాళీలను గుర్తించామన్నారు. సర్వర్ల సమస్యను దృష్టిలో ఉంచుకొని రేపటి వరకు ఆప్షన్ల నమోదుకు గడువు ఇచ్చామన్నారు. బదిలీలకు సంబంధించి పూర్తి వివరాలు ట్రాన్స్‌ఫర్‌ పోర్టల్‌లో ఉంచామన్నారు. బ్లాక్‌ చేసిన స్థానాలకు డీఎస్పీ నియామకాల సమయంలో భర్తీ చేస్తామని తెలిపారు. 

 

Back to Top