తాడేపల్లి: పంచాయతీ ఎన్నికల ఫిర్యాదులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక యాప్‌ను ఆవిష్కరించింది. ఈ- నేత్రం పేరుతో బుధవారం తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఈ-నేత్రం యాప్‌ను విడుదల చేశారు. ఈ యాప్ ద్వారా క్షేత్రస్థాయిలో ఎక్కడి నుంచైనా, ఎవరైనా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. ఫొటోలు, వీడియోలు సైతం అప్‌లోడ్ చేసే సౌలభ్యంతో యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఎన్నికల్లోఅక్రమాలు, ప్రలోభాలు, ఇతర సమస్యలపై ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. ఎన్నికల ఫిర్యాదులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ ఆవిష్కరించిన ఈ - వాచ్ యాప్ పై అనుమానాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఈ-వాచ్ యాప్‌ను రూపొందించారని, దీని నిర్వాహణ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండటంతో తాము ఈ-నేత్రం యాప్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో జరిగిన అక్రమాలను ఫోటోలు, వీడియోల రూపంలో పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపిస్తే..వాటిని ఎన్నికల సంఘానికి అందజేస్తామని లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఈ-నేత్రం యాప్ డౌన్‌లోడ్ కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి https://we.tl/t-eqhCtZ91Kd