మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత

డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి

విజయవాడ: మ‌హిళ‌ల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తెలిపారు. దేశంలో ఏ సీఎం చేయని రీతిలో భద్రతా చర్యలు తీసుకున్నామని చెప్పారు. మహిళలపై నేరాలకు త్వరగా శిక్ష పడేలా దిశ చట్టం తెచ్చామని తెలిపారు. ప్రతి రెండు వేల మందికి ఓ మహిళా పోలీసు నియామకం చేపట్టామని  వివరించారు. దేశంలో ఎక్కడా ఇంత మంది మహిళా పోలీసులు లేరని వెల్లడించారు. ప్రతి మహిళ దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

Back to Top