సీఎం వైయస్‌ జగన్‌ గిరిజన పక్షపాతి

డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి

గిరిజన సంక్షేమంపై గిరిజన సలహా మండలి సమీక్ష

సీఎం వైయస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం

ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు, గిరిజన ప్రాంతాల్లో నూతన గ్రామాల గుర్తింపు

అటవీ హక్కుల గుర్తింపు చట్టం, గిరిజన సమస్యలపై చర్చ

విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గిరిజన పక్షపాతి అని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. గిరిజన సంప్రదాయాలకు, మనోభావాలను గుర్తించి జీవో నంబరు 97ను రద్దు చేయడంతో గిరిజనులు సంతోషంగా ఉన్నారని, ఈ మేరకు గిరిజన సలహా మండలిలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసినట్లు చెప్పారు. మంగళవారం విజయవాడలో గిరిజన సలహా మండలి సమావేశం పుష్పశ్రీవాణి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో గిరిజన సమస్యలపై చర్చించారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం, ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు, గిరిజన ప్రాంతాల్లో నూతన గ్రామాల గుర్తింపు, జీవో నంబరు 97 రద్దు చేయడం పట్ల సీఎం వైయస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు. సమావేశం వివరాలను పుష్పశ్రీవాణి మీడియాకు వివరించారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజనులకు న్యాయం జరగలేదన్న భావన ఉండేదన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉంటున్న నాన్‌ షెడ్యూల్డ్‌ గ్రామాలుగా ఉన్న 530 తాండాలను షెడ్యూల్డ్‌ గ్రామాలుగా మార్చుతూ గిరిజన సలహా మండలిలో తీర్మానం చేశామన్నారు.  ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ప్రమాణాలను సవరించాలని తీర్మానం చేశామన్నారు. గిరిజనేతర ప్రాంతాలకు గిరిజనులకు తరలించినప్పుడు వారి తమకు రావాల్సిన సంక్షేమ పథకాలు కోల్పోయే అవకాశం ఉందని, దీన్ని సవరించాలని తీర్మానం చేశామన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ముందే ఫిబ్రవరి 1 వారంలోనే ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇవ్వడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. గత ప్రభుత్వంలో గిరిజనుల మనోభావాలను లెక్కచేయకుండా బాక్కైట్‌ తవ్వకాల కోసం తీసుకువచ్చిన జీవోను రద్దు చేసిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ గిరిజన సలహా మండలిలో తీర్మానం చేశామన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ గిరిజనుల పక్షపాతి కాబట్టే జీవో నంబర్‌ 97ను రద్దు చేశారని తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత గిరిజనులకు సంబంధించిన అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. సాలూరులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, గిరిజన ప్రాంతంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తూ సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇంజినీరింగ్‌ కాలేజీ, సూపర్‌స్పెషల్‌ ఆసుపత్రి ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల గిరిజన మండలి సీఎంకు ధన్యవాదాలు తెలుపు తీర్మానం చేశామన్నారు. గిరిజనులకు పెళ్లి కానుక లక్ష రూపాయాలకు పెంచారని, ప్రమాద వశాత్తు చనిపోయిన గిరిజనులకు రూ.5 లక్షల బీమా ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. గత ప్రభుత్వం గిరిజన సలహా మండలి ఏర్పాటులో తాత్సరం చేసిందన్నారు. మేం పోరాటం చేస్తే మా పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారని తెలిపారు. వైయస్‌ జగన్‌ సీఎం కాగానే మూడు నెలల్లోనే గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలన్ని కూడా పరిగణలోకి తీసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పుష్పశ్రీవాణి తెలిపారు. గత ప్రభుత్వంలో గిరిజనులకు అన్యాయం జరిగిందన్నారు. గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వకుండా హక్కులను కాలరాశారని విమర్శించారు. వైయస్‌ జగన్‌ తన మంత్రివర్గంలో గిరిజనులకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం సంతోషకరంగా ఉందని పుష్పశ్రీవాణి పేర్కొన్నారు.

 

Read Also: వీవోఏల జీవితాల్లో వెలుగులు

Back to Top