చిత్తూరు: పుంగనూరు అల్లర్లలో చంద్రబాబును ఏ-1గా చేర్చాలని ప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుద్ధీ, జ్ఞానం లేదా? పోలీసుల్ని కొట్టడం తప్పని ఒక్క ప్రకటన అయినా చంద్రబాబు చేశారా? ఇంతవరకు చంద్రబాబు ఒక్క మాట కూడా చెప్పలేదు. పోలీసుల్ని కొట్టడంపై పవన్ కల్యాణ్ ఏమైనా స్పందించారా? అని నిలదీశారు. మంగళవారం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబును ఏ-1గా చేర్చాలి
రాష్ట్రంలో ప్రజా రంజక పాలన అందిస్తున్న సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రజాస్వామ్య బద్ధంగా ఓడించలేక, రాష్ట్రంలో అల్లర్లకు చంద్రబాబు కుట్ర పన్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. పక్కా ప్లాన్ ప్రకారం చంద్రబాబే దాడులు చేయించారని, ఈ దాడులకు వ్యూహకర్త అయిన చంద్రబాబును ఏ1గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని నారాయణ స్వామి డిమాండ్ చేశారు. చంద్రబాబు అన్ని రకాలుగా బరితెగించాడు. పర్యటనల పేరుతో హింసను ప్రోత్సహిస్తున్నాడు. ప్రజలు ఓటేస్తే గెలుస్తామన్న ఆశ చంద్రబాబుకు లేదు. ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేసి, గెలిచిన దాఖలాలు చంద్రబాబుకు లేదు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి తద్వారా లబ్ది పొందాలనేది చంద్రబాబు కుట్ర. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని అబద్ధపు ప్రచారాలు చేసి, రాష్ట్రాన్ని అప్రదిష్టపాలు చేయాలన్నది బాబు కుట్ర.
చంద్రబాబు వ్యూహం ప్రకారమే అల్లర్లు
చంద్రబాబు పథకం ప్రకారమే అంగల్లు-పుంగనూరులో అల్లర్లు జరిగాయి. అధికారం కోసం చంద్రబాబు ఇలా దిగజారి వ్యవహరించటం ఏమిటని నారాయణ స్వామి మండిపడ్డారు. అంగల్లులో జరిగిన దాన్ని ఎల్లో మీడియా వక్రీకరించింది. అక్కడ జరిగిన సభలో సీఎం జగన్ గారిని ఏకవచనంతో వాడు, వీడు, సైకో అని చంద్రబాబు మాట్లాడారు. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలకు బాధ కలిగి స్పందించారు. వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై చంద్రబాబు ప్రోత్సాహంతో టీడీపీ గూండాలు దాడికి దిగారు. ఆ దృశ్యాలన్నీ టీవీల్లో ప్రసారం అయ్యాయి.
కాల్పుల్లో ఎవరైనా చనిపోతే శవరాజకీయాలు చేయాలన్నదే చంద్రబాబు ప్లాన్
చంద్రబాబు కోరిన మేరకే పుంగనూరు బైపాస్ మీదుగా వెళ్లాలని ఎస్పీ రూట్ ఇచ్చారు. రూట్ ప్రకారం చంద్రబాబు వెళ్లలేదు. అల్లర్లను సృష్టించి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలని ప్లాన్ వేసుకున్నారు. ఆ గొడవల్లో పోలీసులపై దాడులు చేయాలి. పోలీసులు ఒకరిద్దరు చనిపోయినా ఫర్వాలేదు. మరోవైపు టీడీపీ వాళ్లు చనిపోయినా పర్వాలేదని గొడవలకు దిగారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే, బీరు బాటిల్స్, రాళ్లు, కర్రలతో దాడులు చేయటం వీడియోల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. టూర్ షెడ్యూల్ లేకపోయినా, పుంగనూరులోకి వెళ్లాలని అంగల్లులో టీడీపీ గూండాలను రెచ్చగొట్టారు. అక్కడ చల్లా బాబు (చల్లా రామచంద్రారెడ్డి)అనే అతను రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అతని ఆధ్వర్యంలో టీడీపీ గూండాలు అల్లర్లకు పాల్పడ్డారు.
పోలీసులు ఎంతో సంయమనంతో వ్యవహరించారు కాబట్టే ప్రాణ నష్టం జరగలేదు
అంగల్లులో ఉన్న అడిషనల్ ఎస్పీ రూట్ ప్రకారం వెళ్లమని చంద్రబాబుకు చెప్పారు. అయితే.. పోలీసుల సూచనలు పట్టించుకోకుండా టీడీపీ రౌడీలు పోలీసులపైనే దాడులకు దిగారు. పోలీసు వ్యవస్థను మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని, పోలీసులు చనిపోయినా పర్వాలేదన్నట్లుగా వ్యవహరించారు. ఈ ఘటన ద్వారా జగన్ గారి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చి అల్లకల్లోలం సృష్టించాలనుకున్నారు. కానీ పోలీసులు ప్రభుత్వానికి ఒక కవచంలా నిలబడ్డారు. ఎస్పీ ఎంతో సాహసోపేతంగా వ్యవహరించినందుకు కృతజ్ఞతలు చెబుతున్నాను. కిందిస్థాయి పోలీసులు కూడా ఎంతో సంయమనంతో వ్యవహరించారు. అదే పోలీసులు కాల్పులు జరిగినట్లైతే కొంత మంది చనిపోయేవారు. కాల్పులు జరిగితే, ప్రభుత్వంపై నెపం వేయాలని చంద్రబాబు కుట్ర పన్నారు. ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, పోలీసులు ఎంతో సంయమనం పాటించారు. సీఎం జగన్ గారి ఆలోచన కూడా పోలీసులు అర్థం చేసుకుని సంయమనంతో వ్యవహరించారు.
డీఎస్పీతో పాటు 10 మంది పోలీసులకు సీరియస్. ఒక కానిస్టేబుల్ కన్నుపోయింది
చంద్రబాబుకు పోలీసులు అడ్డుపడ్డట్లు ఎల్లో మీడియాలో వక్రీకరించి చూపిస్తున్నారు. ముందు గొడవ చేసింది టీడీపీ వాళ్లే. పోలీసుల్ని నా కొడుకులు అని, తరమండని చెప్పింది చంద్రబాబే. అక్కడున్న డీఎస్పీ కేశవప్పను గుడ్డలు తీసి కొట్టమన్నది కూడా చంద్రబాబు నాయుడే. ఇలాంటి పరిస్థితి తీసుకురావడంతో దాదాపు 50-60 మంది పోలీసులకు దెబ్బలు తగిలాయి. ఒక డీఎస్పీతో పాటు మరో పది మంది పోలీసుల పరిస్థితి విషమంగా ఉంది. ఒక కానిస్టేబుల్‌కు కన్ను కూడా పోయింది. ఇదంతా చంద్రబాబు వల్లనే జరిగాయి.
పోలీసులపై దాడులు జరిగితే పవన్ ఖండించరా..?
- ఎస్పీ గురించి లోకేశ్ మాట్లాడుతున్నారు. రెడ్ డైరీలో పేరు రాసుకున్నానని అంటున్నాడు. ఎస్పీని పేరు పెట్టి.. నేను ఎవరో తెల్సా.. నా ప్రభుత్వం వచ్చాక నీ కథ తెలుస్తా అని లోకేశ్ అనటం ఏమిటి? లోకేశ్‌కు రాజకీయాలు తెలియవు. ప్రజల చేత ఏనాడూ ఎన్నుకోబడిన వ్యక్తి కాదు. కనీసం వార్డు మెంబర్‌గా కూడా లోకేశ్ ఎన్నిక కాలేదు. అలాంటి లోకేశ్ ఎస్పీపై మాట్లాడుతుంటే.. కనీసం చంద్రబాబు ఖండించలేదు. పోలీసులపై దాడులు జరిగినా పవన్ స్పందించలేదు. పోలీసులు లేకపోతే శాంతిభద్రతలు లేవు. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు అందరూ శాంతిభద్రతలు కాపాడుతున్నారు. పోలీసులపై చంద్రబాబే దాడులు చేయిస్తే.. పవన్ ఖండించకపోవటం ఏమిటి?
- ప్రజలు ఎవరు ఎన్నుకుంటారో వారు ముఖ్యమంత్రి అవుతారు. ప్రజలు ఎన్నుకుంటే ఎమ్మెల్యేలు అవుతారని లోకేశ్‌కు నారాయణ స్వామి చురకలు అంటించారు. టీడీపీ కార్యకర్తలకు రాళ్లు, కర్రలు, కత్తులు, బీరు బాటిల్స్ ఎక్కడ నుంచి వచ్చాయి. మేమే రాళ్లు వేశామని లోకేశ్ అంటున్నారు. ఎవరు రాళ్లు వేశారో వీడియో పుటేజి ఉంది. ఈ వ్యవహారంలో చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు. అమాయకుల్ని, పేదవారిని చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. ఎంత మందినైనా తెచ్చి ఫ్రీగా మద్యం పోస్తానని అంటున్న చంద్రబాబే దీనికి బాధ్యుడు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇదే పోలీసులు సహకరించలేదా?
బాబుది వెన్నుపోటు చరిత్రః
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద రెండు సార్లు ఓడిపోయిన కసితో చల్లా బాబు ఉన్నాడు. ఒకవేళ రాజకీయంగా పైకి రావాలనుకుంటే ప్రేమతో ప్రజల దగ్గరకు పోవాలి. ఇలా దౌర్జన్యాలు చేసి పోలీసు వ్యవస్థపై దాడి చేస్తే..గెలవలేవు అన్నది గుర్తెరగాలి. చంద్రబాబు, టీడీపీ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా.. సీఎం జగన్ గారు ఎంతో సహనం పాటిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ గారు, శ్రీరాముడి పాలనను ఆదర్శంగా తీసుకుని ఎన్ని బాధలు వచ్చినా భరిస్తున్నారు. పోలీసులు మాకు తొత్తులు అని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఎవరు అధికారంలో ఉన్నా.. పోలీసులు ఎప్పుడూ స్వతంత్రంగా వ్యవహరిస్తారు. చంద్రబాబుది నీచమైన చరిత్ర. వెన్నుపోటు చరిత్ర. పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇస్తే.. కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చే చరిత్ర. అభివృద్ధి కార్యక్రమాలు ఆటంకం పరిచే చరిత్ర చంద్రబాబుదని నారాయణ స్వామి మండిపడ్డారు.
- నవరత్నాలు అంటే ఏమిటో అర్థం చేసుకో చంద్రబాబు. పేదల తలరాతలు మార్చేవి నవరత్నాలు. పేదవారు కూడా రాజకీయ సమానత్వం, విద్యా సమానత్వం, ఆర్థిక సమానత్వం రావాలని సీఎం జగన్ గారు ప్రాధాన్యత ఇచ్చారు.
- టీడీపీ వాళ్ళు పోలీసు వాహనాలు కాల్చారు. హింసను ప్రేరేపించి లబ్ధి పొందాలని చూశారు. ఆ తర్వాత శవ రాజకీయాలు చేయాలని కుట్రలు పన్నారు. ఇలాంటి ఘటనలు దేనికి సంకేతం. చంద్రబాబు నాయుడు బుద్ధి ఎలా ఉందంటే.. తన రాజకీయం కోసం, ఆఖరికి మద్యంలో విషం కల్పినా కలుపుతారని నారాయణ స్వామి సందేహం వ్యక్తం చేశారు. ఇలాంటి పార్టీలు, మనుషుల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని నారాయణ స్వామి హెచ్చరించారు.
ఔరంగజేబుకు అన్న చంద్రబాబు
- పోలీసులపై దాడులు జరిగినా ఎంతో ఓపిగ్గా వ్యవహరించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చంద్రబాబు ఎప్పటికీ గెలవలేరు. బయట నుంచి టీడీపీ రౌడీలను తెచ్చి దాడులకు పాల్పడ్డారు. అంగల్లు దాడిలో మా నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తులు కూడా కొందరు ఉన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించి కలెక్టర్ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే రాబోయే రోజుల్లో చంద్రబాబు భయంకరమైన పరిస్థితులు కల్పిస్తారు. ఏనాడూ చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కాపాడలేదు. ఔరంగజేబుకు అన్న చంద్రబాబు. మాపై రాళ్లు వేసిన టీడీపీ కార్యకర్తలకు కూడా నవరత్నాలు అందాయి. టీడీపీ కార్యకర్తలు చంద్రబాబును నమ్మితే జైలుకు వెళ్తారు. అల్లర్లలో ఏ1గా చంద్రబాబును నమోదు చేయాలని ఎస్పీ, డీజీపీని కోరుతున్నాను.
కన్ను కోల్పోయిన కానిస్టేబుల్ రణధీర్‌కు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం గారు
- అంగల్లు ఘటనలో దురదృష్టవశాత్తూ పోలీసు శాఖకు చెందిన రణధీర్ కానిస్టేబుల్ ఒక కన్ను కోల్పోయారు. రెండో కన్ను పరిస్థితి ఏమిటో ఇప్పుడే చెప్పలేమని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఘటనపై సీఎం జగన్ గారు తక్షణం స్పందించి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వటమే కాకుండా రణధీర్ కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించారు.
- మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుద్ధీ, జ్ఞానం లేదా? పోలీసుల్ని కొట్టడం తప్పని ఒక్క ప్రకటన అయినా చంద్రబాబు చేశారా? ఇంతవరకు చంద్రబాబు ఒక్క మాట కూడా చెప్పలేదు. పోలీసుల్ని కొట్టడంపై పవన్ కల్యాణ్ ఏమైనా స్పందించారా?
- 9 నెలల తర్వాత లోకేశ్ ఎస్పీని టార్గెట్ చేస్తాడంట. వార్డు మెంబర్ కాలేనివాడు స్టేట్‌మెంట్లు ఇచ్చి బెదిరిస్తే.. ఎవరైనా బెదురుతారా?
- వైయస్ జగన్ గారి గురించి అన్యాయంగా మాట్లాడినవారు, రాజకీయంగా ఇబ్బంది పెట్టినవారంతా పొలిటికల్‌గా జీరో అయిపోయారు. చంద్రబాబు కూడా జీరో అయిపోయాడు.
- పోలీసు వ్యవస్థ మీద అనవసర మాటలు మాట్లాడటం ఏమిటి? చంద్రబాబుకు జడ్ కేటగిరీ ప్రొటెక్షన్ ఇస్తున్నది కూడా పోలీసులే కదా.
- 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. కొట్టండి.. నరకండి అంటున్నాడు..
- పోలీసు జీపులు కాల్చుతుంటే.. ఇది తప్పని కనీసం చెప్పాడా? ఇంత అన్యాయమైన పనులు చేసిన చంద్రబాబును ఎవరూ సపోర్టు చేయరు. రాక్షసమూకలు మాత్రమే ఆయనకు సపోర్టు చేస్తున్నారు.