మైనారిటీల సంక్షేమానికి సీఎం వైయస్‌ జగన్‌ కృషి

మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ సేవలు చిరస్మరణీయం

డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా  
 

విజయవాడ: రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కృషి చేస్తున్నారని డిప్యూడీ సీఎం అంజాద్‌బాషా పేర్కొన్నారు. జాతీయ విద్య, మైనారిటీల సంక్షేమ దినోత్సవ వేడుకలు సోమవారం విజయవాడ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంజాద్‌బాషా మాట్లాడుతూ..దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ సేవలు చిరస్మరణీయమని  పేర్కొన్నారు. 
దేశ స్వాతంత్ర్యం కోసం, దేశ ఉజ్వల భవిష్యత్‌ కోసం త్యాగాలు చేసిన మహనీయులందరికీ జోహార్లు అర్పిస్తున్నాను. స్వాతంత్ర్య భారత మొదటి విద్యాశాఖ మంత్రి అబుల్‌ కలాం అజాద్‌ జయంతిని జాతీయ విద్యా దినోత్సవాన్ని దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఏర్పాటు చేశారని తెలిపారు. తొలి విద్యాశాఖ మంత్రిగా రెండుసార్లు పని చేసి విద్యారంగంలో 60 ఏళ్ల క్రితమే గొప్ప పునాదులు చేశారని కొనియాడారు. ఇలాంటి నేతను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సంపూర్ణ అక్షరాస్యతతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటికి మన దేశంలో కేవలం 12 శాతం అక్షరాస్యత ఉండేదన్నారు. అప్పట్లో దేశం ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమిస్తూ..విద్యా రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మౌలాన అబుల్‌ కలాం ఆజాద్‌ కృషి చేశారన్నారు. ప్రపంచంలో విద్యను ప్రాథమిక హక్కుగా చేసిన కలాం చేసిలు చిరస్మరణీయమన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఆయన విద్యా విధానాన్ని రూపొందించారన్నారు. అవసరమైన లక్ష్యాలను సొంత ఆలోచనతో రూపొందించారని తెలిపారు. వందలాది సైన్స్‌, అండ్‌ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేయగలిగామంటే దాని వెనుక కలాం కృషి ఉందన్నారు. ఇలాంటి గొప్ప నేత పేరుతో మన రాష్ట్ర ప్రభుత్వం చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో రూ.950 కోట్లు కేటాయించారని తెలిపారు. షాదీఖానా అభివృద్ధికి నిధులు కేటాయించామని చెప్పారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఇమామ్‌, మౌజమ్‌లకు గతంలో ఇస్తున్న గౌరవేతనాన్ని వైయస్‌ జగన్‌ పెంచారని తెలిపారు. రంజాన్‌, ఉర్దూ,షాదీఖానా నిర్వాహణకు నిధులు కేటాయించామన్నారు. స్వయం ఉపాధి పథకాల కోసం రూ.150 కోట్లు కేటాయించామని చెప్పారు. ఏపీ నుంచి హజ్‌ యాత్రకు బయలుదేరే వారికి గన్నవరం ఎయిర్‌పోర్టులో సౌకర్యాలు కల్పించామన్నారు. ఏపీ స్టేట్‌ ఉర్దూ అకాడమీ కోసం నిధులు కేటాయించామని, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం నిధులు వెచ్చించామని తెలిపారు. మైనారిటీ సబ్‌ ప్లాన్‌ కోసం కూడా ప్రతిపాదనలు రూపొందించామని చెప్పారు. సచార్‌ కమిటీ, రంగనాథ కమిటీ సిపార్స్‌ల మేరకు ప్రతిపాదనలు రూపొందించామన్నారు. క్రైస్తవులు యోరుషలేమ్‌ యాత్రకు వెళ్లేందుకు నిధులు కేటాయించామన్నారు. చర్చీల నిర్వాహణకు రూ.100 కోట్లు కేటాయించామని, ఏపీ క్రిస్టియన్‌ భవనానికి నిధులు కేటాయించామన్నారు. చర్చి పాస్టర్లకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నట్లు చెప్పారు. మైనారిటీల సంక్షేమానికి వైయస్‌ జగన్‌ ఆధ్వర్యంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఐదు నెలల్లోనే అమలు చేశారన్నారు. వైయస్‌ జగన్‌ను మీరందరూ కూడా నిండుమనసుతో ఆశీర్వదించాలని కోరారు.

Read Also: అబుల్‌ కలాం ఆజాద్‌కు సీఎం వైయస్‌ జగన్‌ నివాళి

తాజా ఫోటోలు

Back to Top