అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయి

డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా
 

వైయస్‌ఆర్‌ జిల్లా: రాష్ట్రంలోని కోవిడ్‌ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా పేర్కొన్నారు.వైయస్ఆర్‌ జిల్లాలోని ఫాతిమా మెడికల్‌ కాలేజీని శుక్రవారం అంజాద్‌బాషా సందర్శించి, అక్కడ కోవిడ్‌ రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..సీఎం వైయస్‌ జగన్‌ రాష్ట్రంలో కరోనా నియంత్రణకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. దేశంలోనే ఏపీలో అత్యధిక టెస్టులు చేస్తున్నామన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, క్వారంటైన్‌ కేంద్రాల్లో అన్ని రకాల వసతలు కల్పించామన్నారు. కరోనా కట్టడికి మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. రెడ్‌జోన్లలో ఎవరూ బయటకు రావద్దని, ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని అంజాద్‌బాషా కోరారు.

Back to Top