అర్హులైన గిరిజనులకు రుణాలు మం‍జూరు చేయండి

గిరిజన సంక్షేమశాఖ, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

అమరామతి : అర్హులైన గిరిజనులకు లబ్ది చేకూరకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమశాఖ, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి  అధికారులను ఆదేశించించారు. అర్హులైన గిరిజనులకు రుణాలు మం‍జూరు చేయాలన్నారు. అమరావతిలో గిరిజన సంక్షేమశాఖపై ఆమె శుక్రవారం సమీక్ష నిర్వహించారు.  ట్రైకార్‌ రుణాల మంజూరు విషయంలో అవినీతిని గుర్తించిన డిప్యూటీ సీఎం.. తక్షణమే కార్ల కొనుగోలు రుణాల మంజూరులో అవినీతిపై విచారణకు ఆదేశించించారు. అర్హులైన గిరిజనులకు రుణాలు మం‍జూరు చేయాలన్నారు.  జీసీసీ భవనాన్ని 5 కోట్లతో నిర్మించాలని అధికారులకు ఆదేశించారు.

నష్టాల్లో ఉన్న జీసీసీని లాభాల్లో తెచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. అలాగే మినీ గురుకులాల విద్యార్థులకు హాస్టల్ వసతి పూర్తిగా కల్పించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31 గురుకులాల నిర్మాణం కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో జీవో 3ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించడానికి వీల్లేదని, ఏకలవ్య పాఠశాలల్లో నాణ్యమైన ఉపాధ్యాయులను నియమించాలని అధికారులను సూచించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top