సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న దేశానికే ఆద‌ర్శం 

క‌డ‌ప న‌గ‌రంలో `గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం`లో పాల్గొన్న డిప్యూటీ సీఎం అంజాద్ బాషా

క‌డ‌ప‌: సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తోంద‌ని డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా అన్నారు. స‌చివాల‌యం, వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌, నాడు-నేడు వంటి వాటిని ఇత‌ర రాష్ట్రాలు సైతం ఫాలో అవుతున్నాయ‌ని చెప్పారు. వైయ‌స్ఆర్ జిల్లా క‌డ‌ప న‌గ‌రంలోని 9వ డివిజ‌న్ ఎన్‌జీవో కాల‌నీలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కాల‌నీలోని ఇంటింటికీ తిరిగి న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. ప‌థ‌కాలు అందుతున్నాయా.. లేదా, ఇంకేమైనా స‌మ‌స్య‌లు ఉన్నాయా  అని ఆరా తీశారు. రూపాయి లంచం లేకుండా సంక్షేమ ప‌థ‌కాల‌న్నీ ప్ర‌తీ ఇంటికీ అందుతున్నాయ‌ని ప్ర‌జ‌లంతా ముక్తకంఠంతో చెబుతున్నార‌ని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌డ‌ప మేయ‌ర్ సురేష్‌బాబు, డివిజన్ కార్పొరేటర్, క‌డ‌ప న‌గ‌ర మ‌హిళా అధ్య‌క్షురాలు వెంక‌ట‌సుబ్బ‌మ్మ‌, ప్రజా ప్రతినిధులు, అధికారులు పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.  

తాజా వీడియోలు

Back to Top