వైయస్‌ఆర్‌సీపీలోకి సీనియర్‌ నేత దాడి వీరభద్రరావు

రాష్ట్రానికి వైయస్‌ జగన్‌ సీఎం కావడం  చారిత్రాత్మక అవసరం

అన్నింటా టీడీపీ ప్రభుత్వం విఫలం

అభివృద్ధి,సంక్షేమాన్ని చంద్రబాబు గాలికొదిలేశారు

మీడియాతో దాడి వీరభద్రరావు

హెదరాబాద్‌:సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు నేడో,రేపో వెలువడుతుందనుకుంటున్న తరుణంలో వైయస్‌ఆర్‌సీపీలోకి వలసల వెలువ మరింత ఊపందుకుంది.తాజాగా వైయస్‌ఆర్‌సీపీలోకి విశాఖకు జిల్లాకు చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి  దాడి వీరభద్రరావు,తనయుడు రత్నాకర్‌లు  చేరారు.వారికి పార్టీ అ«ధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియాతో దాడి వీర భద్రరావు మాట్లాడారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం చారిత్రాత్మక అవసరమని దాడి వీరభద్రరావు అన్నారు.రాష్ట్రం బాగుపడుతుందని నమ్మకంతో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించారని..కాని ఆ ఆశలు వమ్ము చేశారన్నారు.ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందన్నారు. అవినీతి విలయం తాండవం చేస్తున్నారు. సామాన్య ప్రజలు లంచాలు చెల్లించకుండా పనులు చేయించుకునే  పరిపాలన లేదన్నారు. చంద్రబాబు పరిపాలనను గాలికొదిలేసిందన్నారు.కేవలం అధికారమే పరమావధిగా పరిపాలించారే తప్ప ప్రజా సంక్షేమాన్ని విస్మరించారన్నారు.ఎన్నికల సమీపంలో ప్రజలకు పప్పుబెల్లాలు పంచుతున్నారని విమర్శించారు.

ప్రజలు గతమంతా మరిచిపోయి ఓట్లు వేస్తారనే ఉద్దేశ్యంతో మళ్లీ మభ్యపెడుతున్నారన్నారు.ప్రజలు అమాయకులు కాదని, ఇలాంటివి చాలా చూసారన్నారు.ఎన్టీఆర్‌ తెలుగుదేశం పెట్టినప్పుడు కిలో రెండు రూపాయలకు బియ్యం ఇస్తానని చెప్పినప్పుడు..ముఖ్యమంత్రిగా ఉన్న విజయభాస్కర్‌ రెడ్డి రూపాయి తొంభై పైసాలకే ఇస్తానని చెప్పారు. కాని ప్రజలు అటువంటి జిమ్మిక్కులను నమ్మలేదన్నారు.నేడు తెలుగుదేశం పార్టీ ఉనికి పోయిందన్నారు.కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థా«పించారని..కాని నేడు చంద్రబాబు కాంగ్రెస్‌తో జత కట్టి ఎన్టీఆర్‌ ఆశయాలకు పూర్తిగా తూట్లు పోడిచారన్నారు.తెలుగు కాంగ్రెస్‌గా టీడీపీ తయారయ్యిందన్నారు. కాంగ్రెస్‌కు తెలుగుదేశం పార్టీని అనుబంధం సంస్థగా తయారుచేయడం విచారకరమన్నారు. వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఎంపీ విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top