రాజ్యాంగం అణ‌గారిన వ‌ర్గాల‌కు అండ‌

మంత్రి మేరుగ నాగార్జున‌

విజ‌య‌వాడ న‌గ‌రంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం 

విజ‌య‌వాడ‌: రాజ్యాంగం అణగారిన వర్గాలకు అండగా నిలిచింద‌ని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. విజ‌య‌వాడ‌లో రాజ్యాంగ అమోద దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ విగ్రహానికి మంత్రి మేరుగ నాగార్జున‌, మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు, ఎస్సీ క‌మిష‌న్ స‌భ్యులు కాలే పుల్లారావు త‌దిత‌రులు పూల‌మాల వేసి  అంజలి ఘటించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ..అనేక సంస్కృతులు, భాషలు, ప్రాంతాలు, మతాల కలయిక అయిన భారత దేశానికి రాజ్యాంగం రూపొందించడం ఒక సవాలు వంటిదన్నారు. అంబేద్కర్‌ దాన్ని స్వీకరించి మహోన్నతునిగా నిలిచారన్నారు.  బడుగు, బలహీన వర్గాల సంక్షేమం లక్ష్యంగా డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ భారత రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అంబేద్క‌ర్ భావ‌జాలంతో పాల‌న‌లో అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చార‌న్నారు.  

2023 ఏప్రిలో బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నామ‌ని మంత్రి చెప్పారు.  కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్ కుమార్, రుహుల్లాహ్ గర్, నగర అధ్యక్షులు బొప్పన భవకుమార్, తూర్పు ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ , నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతంరెడ్డి, మైనారిటీ కార్పొరేషన్ ఛైర్మన్ అసిఫ్, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గా, అవుతూ శ్రీశైలజా,  ఎస్సీ సెల్ నాయ‌కులు బుదాల శ్రీను, మధిర ప్రభాకర్, లెల్లపూడి లాజర్, ప్రభాకర్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top