ఛాంపియన్‌కు అభినందనలు

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌
 

తాడేప‌ల్లి: ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌-2022లో రజత పతకం సాధించ‌డం ప‌ట్ల ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినంద‌లు తెలిపారు. ఈ  మేర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. నీరజ్ చోప్రా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో జావెలిన్ త్రోలో రజతం సాధించడం ద్వారా నిజంగా దేశానికి,  సైన్యానికి గర్వకారణమ‌ని ట్వీట్‌లో పేర్కొన్నారు.   ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో పతకం గెలిచిన రెండో భారత అథ్లెట్‌గా చోప్రా నిలిచాడు.  

Back to Top