వేలూరులో 'గడప గడపకు మన ప్రభుత్వం'

 మంత్రి విడ‌ద‌ల ర‌జినికి గ్రామంలో ఘ‌న స్వాగ‌తం

ప‌ల్నాడు: చిలకలూరిపేట రూరల్ మండలం వేలూరు గ్రామంలో గురువారం 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి విడ‌ద‌ల ర‌జిని హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటింటా ప‌ర్య‌టించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు సక్రమంగా అందుతున్నాయ లేదా అని ఆరా తీశారు. ప్ర‌తి ఇంటి వ‌ద్ద మంత్రికి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రభుత్వం లో తమకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని సంతోషం వ్య‌క్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top