స‌దా మీకు రుణపడి ఉంటా

కడప బహిరంగ సభలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

కడపలో రూ.400 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

రోడ్లు సుందరీకరణ జరిగితే మంచి నగరాల జాబితాలో కడప కూడా చేరుతుంది

బుగ్గవంత పెండింగ్‌ పనులకు రూ.50 కోట్లు కేటాయింపు

సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం అభివృద్ధి పనులు చేపట్టాం

 డాక్టర్‌ వైయస్‌ఆర్‌ క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌కు టెండ‌ర్లు పూర్తయ్యాయి

వైయస్‌ఆర్‌ కడప జిల్లా: వైయస్‌ఆర్‌ కడప జిల్లా ప్రజలు తన పై చూపుతున్న అభిమానం, ఆప్యాయతలు ఎల్లప్పుడూ నా మనసులో ఉంటాయని, ఇంతటి  ఆప్యాయతలు, ప్రేమానురాగాలు చూపినందుకు  సదా మీకు రుణపడి ఉంటానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తరువాత కడప అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదన్నారు.   కడప మహావీర్‌ సర్కిల్‌లో రహదారుల అభివృద్ధి పనులకు, సుమారు రూ.400 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపనలు చేశారు. మహావీర్‌ సర్కిల్‌ వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు.

ఈ రోజు కడపలో దాదాపుగా రూ.400 కోట్లకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటి దాకా జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా చక్కగా పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ రోజు మళ్లీ ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. కడపలో రోడ్డు మార్గం ద్వారా వచ్చే సమయంలో ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. గతంలో నాన్నగారి హాయంలో 2004 నుంచి 2009 మధ్యలో కడప ఈ మాదిరిగా అభివృద్ధి జరిగింది. ఆ తరువాత కడపను ఎవరూ పట్టించుకోలేదు. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో కడపకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. గతంలో చేసిన దానికన్నా  ఇంకా అడుగులు ముందుకు వేస్తూ ఈ రోజు మహావీర్‌ సర్కిల్‌ నుంచి పుట్లంపల్లె వరకు 100 అడుగల వేడల్పుతో ఆరువరుసల రోడ్డు వేశాం. రైల్వే స్టేషన్‌ వరకు ఫోర్‌లైన్‌ రోడ్డు వేశాం.  ఈ రోడ్డును ప్రారంభించడం సంతోషంగా ఉంది. 

ఈ రోజు శంకుస్థాపన చేసే కార్యక్రమానికి వచ్చి నగరంలో మరిన్ని రోడ్లు విస్తరిస్తున్నాం. కృష్ణా థియేటర్‌ నుంచి దేవుడి కడప వరకు రూ.101 కోట్లతో ఫోర్‌లైన్‌ రోడ్డు కూడా వేసేందుకు శంకుస్థాపనలు చేస్తున్నాం. అన్నమయ్య సర్కిల్‌ నుంచి గోకుల్‌ లాడ్జి వరకు రూ.74 కోట్లతో రోడ్డు విస్తరణ పనులకు ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం. అంబేద్కర్‌ సర్కిల్‌ నుంచి వై జంక్షన్‌ రోడ్డు వరకు నిర్మాణం వ రకు రూ.62 కోట్లతో విస్తరణ పనులు ప్రారంభిస్తున్నాం. ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్‌ నుంచి పుట్లంపల్లి వరకు రహదారి విస్తరణ పనులకు కూడా శంకుస్థాపనలు చేస్తున్నాం. ఈ రోడ్లు సుందరీకరణ జరిగితే మంచి నగరాల జాబితాలో కడప కూడా చేరుతుందని కచ్చితంగా చెప్పగలను. 

బుగ్గవంక పొంగినప్పుడు , వరద వచ్చినప్పుడు ఆ కష్టాలు ఏంటో అందరికీ తెలుసు. నాన్నగారి హాయాంలో అప్పట్లో బుగ్గవంక నుంచి రక్షణ కల్పించేందుకు రక్షణ గోడ, ఐదు బ్రిడ్జిలు నిర్మించారు. ఇంకా మిగిలిపోయిన పనులు ఆ రోజు నుంచి ఎవరూ పట్టించుకోలేదు. ఈ మధ్యలో వరద వచ్చినప్పుడు నాకు కనిపించాయి.ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని రూ.49.60 కోట్లతో పెండింగ్‌ పనులు పూర్తి చేసి వరద ముప్పు నుంచి బయట పడే పనులు చేపడుతున్నాం. వీటికి కూడా ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం. మిగతా చెరువులను పునరుద్ధించడంతో పాటు బ్యూటిఫికేషన్‌ పనులకు ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం.

తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన ప్రఖ్యాత సీపీ బ్రౌన్‌ స్మారకార్థం గ్రంథాలయ ఆవరణంలో నూతన భవనానికి రూ.5.50 కోట్లతో శంకుస్థాపన చేశాం. ఇవన్నీ కూడా దాదాపుగా రూ.400 కోట్లతో శంకుస్థాపనలు చేశాం.

బుగ్గవంక నుంచి కడప నగరానికి వరద నుంచి రక్షణ కల్పించినా..నగరంలోని ఆర్కే నగర్, తిలక్‌ నగర్, ఎస్‌బీఐ కాలనీ, ప్రకాశ్‌ నగర్, తదితర ప్రాంతాల్లో చిన్నపాటి వర్షానికి జలమయం అవుతున్నాయి. ఈసమస్యను కూడా శాశ్వత పరిష్కారం చూపితే బాగుంటుందని ఇక్కడికి రాకముందే కాసేపటి క్రింతం డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మేయర్‌ నా దృష్టికి తెచ్చారు. వీటి వల్ల కడప నగరానికి మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నా..

కడప నగరంలో రూ.125 కోట్లతో డాక్టర్‌ వైయస్‌ఆర్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మరో 4.82 కోట్లతో డాక్టర్‌ వైయస్‌ఆర్‌ సైక్రియాట్రిక్‌ ఆసుపత్రి పనులు కూడా  చక్కగా జరుగుతున్నాయి. అలాగే రూ.107 కోట్లతో డాక్టర్‌ వైయస్‌ఆర్‌ క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు టెండర్‌ ప్రక్రియ పూర్తి అయ్యింది. త్వరలోనే అనుమతులు వస్తాయి. ఆ పనులు కూడా వేగవంతం చేస్తాం. 
రాజీవ్‌ మార్గ్‌ అభివృద్ధికి రూ.4 కోట్లతో పనులు జోరుగా జరుగుతున్నాయి. రూ.50 కోట్లతో దేవుడి కడప సరస్సు పనులు కూడా జరుగుతున్నాయి. 

ఇవాళ మీ అందరితో కూడా ఒకే ఒక చిన్న విషయం చెప్పాలి. కడప జిల్లాకు ఎంత చేసినా తక్కువే. ఈ జిల్లా రుణం తీర్చుకోలేను. ఈ జిల్లా ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. ఈ జిల్లాను మేం చూసుకుంటాం. మీరు రాష్ట్రాన్ని చూసుకోండని భరోసాతో చెబుతున్నారు. మీ అందరి సహకారంతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతున్నాను.  మీరందరూ నాపై చూపుతున్న అభిమానం, ఆప్యాయతలు ఎల్లప్పుడూ నా మనసులో ఉంటాయి. ఇంతటి  ఆప్యాయతలు, ప్రేమానురాగాలు చూపినందుకు మరొక్కసారి సదా మీకు రుణపడి ఉంటానని ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సీఎం వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.
 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top