సెప్టెంబర్‌ 1 నుంచి 3 వరకు సీఎం వైయస్‌ జగన్‌ వైయస్ఆర్‌ జిల్లా పర్యటన

పలు అభివృద్ది కార్యక్రమాలపై సమీక్షలు, ప్రారంభోత్సవాలు

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సెప్టెంబ‌ర్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వ‌ర‌కు వైయ‌స్ఆర్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ మేర‌కు షెడ్యూల్ విడుద‌ల చేశారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం బయలుదేరనున్న సీఎం, 3.30 గంటలకు వేముల మండలం వేల్పుల గ్రామానికి చేరుకుని గ్రామ సచివాలయం కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవం, సాయంత్రం 5.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 5.35 గంటలకు ఇడుపులపాయ చేరుకుని వైయస్సార్‌ ఎస్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస.

సెప్టెంబర్ 2న ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌నుంచి బయలుదేరి, 9.00 – 9.40 గంటల వరకు ఎస్టేట్‌లోని వైయస్సార్‌ ఘాట్‌ వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. 9.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఎస్టేట్‌లోని ప్రేయర్‌ హాల్లో పులివెందుల నియోజకవర్గ అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం వరకు సమీక్షా సమావేశాల అనంతరం ఎస్టేట్‌లోని వైయస్సార్‌ గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస చేస్తారు.

సెప్టెంబర్ 3న ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి 10.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top