నేడు జ‌గ్గంపేట‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నేడు కాకినాడ జిల్లా జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహ వేడుక‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొనున్నారు. ఉద‌యం తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి బ‌య‌ల్దేరి జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గం ఇర్రిపాక‌కు చేరుకుంటారు. ఎమ్మెల్యే జ్యోతుల నివాసంలో జ‌రిగే వివాహ వేడుక‌లో పాల్గొని నూత‌న వ‌ధూవ‌రులు ప‌ద్మ‌శ్రీ అన్న‌పూర్ణ‌, సాయి ఆద‌ర్శ్‌ల‌ను ఆశీర్వ‌దించ‌నున్నారు. ఆ కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. 

తాజా వీడియోలు

Back to Top