తాడేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలలో పూర్తి స్ధాయి రెగ్యులర్ సిబ్బంది నియామకానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు. యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో భారీ రిక్రూట్‌మెంట్‌కు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. 3295 పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. నవంబరు 15 నాటికి నియామక ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పోస్టుల భర్తీ చేయాలని, ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలని సూచించారు. యూనివర్సిటీల్లో 2635 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లుతో పాటు, ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టుల భర్తీ. ఇప్పటికే వైద్యఆరోగ్యశాఖలో దాదాపు 51వేల పోస్టుల భర్తీ చేసిన ప్రభుత్వం. ఉన్నత విద్యాశాఖలో అత్యున్నత ప్రమాణాల కల్పనలో భాగంగా ఇప్పటికే ప్రపంచస్ధాయి కరిక్యులమ్ ఏర్పాటు దిశగా సన్నాహాలు. ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే..: రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో మొత్తం ఖాళీలు భర్తీ చేయాలని అధికారులకు ఆదేశం. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖలో 51వేల పోస్టుల భర్తీ చేశాం. విశ్వవిద్యాలయాల్లో కూడా పూర్తి స్ధాయిలో ఖాళీలను భర్తీ చేయాల్సిందేనన్న సీఎం. యూనివర్సిటీలలో ఉత్తమ ఫలితాలు సాధించాలంటే... పూర్తి స్ధాయిలో రెగ్యులర్ పోస్టుల భర్తీ చేయాల్సిందేనని స్పష్టం చేసిన సీఎం. యూనివర్సిటీల్లో మొత్తం 2635 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడానికి సీఎం ఆమోదం. అదే విధంగా ట్రిపుల్ ఐటీలలో మరో 660 (లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు) పోస్టుల భర్తీకి అధికారుల ప్రతిపాదన. వాటిని కూడా ఈ రిక్రూట్‌మెంట్‌లోనే భర్తీ చేయాలని ఆదేశించిన సీఎం. మొత్తం 3295 పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్. నిర్దేశించిన ప్రమాణాలతో అభ్యర్ధులు కచ్చితంగా క్వాలిఫై కావాలి. నూటికి నూరుశాతం మెరిట్ ఉండాలి. అదే విధంగా ఇప్పటికే కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న వారికి సంవత్సరానికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు వెయిటేజ్ ఇవ్వాలని ప్రతిపాదించిన అధికారులు. ఇంటర్వ్యూ టైంలో ఈ వెయిటేజ్ ఇవ్వాలని నిర్ణయం. పిల్లలు యూనివర్సిటీల నుంచి క్వాలిటీ ఎడ్యుకేషన్‌తో బయటకు రావాలంటే బోధనా సిబ్బంది నియామకాలు, అర్హత ప్రమాణాలు కచ్చితంగా నాణ్యతగా ఉండాలన్న సీఎం. 1.30 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకాలను ఎలాంటి లోపాలు లేకుండా సకాలంలో నిర్వహించామన్న సీఎం. అదే తరహాలో యూనివర్సిటీల అధ్యాపకుల నియామకాల ప్రక్రియలోనూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా... త్వరితగతిన చేపట్టాలన్న సీఎం. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై షెడ్యూల్, పరీక్షా విధానంపై సీఎంకు వివరాలందించిన అధికారులు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నట్టు తెలిపిన అధికారులు. విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన షెడ్యూల్. 23 ఆగష్టున యూనివర్సిటీల్లో 3295 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. సెప్టెంబరు 3,4 వారాల్లో పరీక్షలు నిర్వహించనున్న ఏపీపీఎస్సీ. ఆన్‌లైన్‌లో పరీక్షా విధానం. 10 అక్టోబరు కల్లా పరీక్షా ఫలితాలు విడుదల. రిటన్ టెస్ట్ ఫలితాలు విడుదల అనంతరం నెల రోజుల్లో ఇంటర్వ్యూలు నిర్వహణకు నిర్ణయం. నవంబరు 15 నాటికి ఇంటర్వ్యూల సహా నియామక ప్రక్రియ పూర్తి. అదే రోజు అన్ని ఎంపికైన అభ్యర్ధుల జాబితాను డిస్‌ప్లే చేయనున్న యూనివర్సిటీలు.