విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైయస్ భారతి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు చేరుకున్న సీఎం వైయస్ జగన్ దంపతులు.. నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులను ఘనంగా సత్కరించారు. రేపు ఏపీ గవర్నర్‌గా అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.