ఈనెల 14న పోలవరానికి సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ఈనెల 14వ తేదీన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సందర్శించనున్నారు. క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేయనున్నారు. జాతీయ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలనేది సీఎం వైయస్‌ జగన్‌ సంకల్పం.. ఆ దిశగానే 2021 నాటికి ప్రాజెక్టు పూర్తిచేయాలని టార్గెట్‌ పెట్టుకున్నారు. ప్రాజెక్టు ఖర్చు విషయంలో ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సవివరంగా సీఎం లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే. 
 

Back to Top