మ‌రికాసేప‌ట్లో కుప్పం చేరుకోనున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను జాతికి అంకితం చేయనున్న ముఖ్య‌మంత్రి

చిత్తూరు: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కుప్పం ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరారు. గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టు నుంచి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం.. మ‌రికాసేప‌ట్లో కుప్పం చేరుకోనున్నారు. కాసేపట్లో‌ కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అనంత‌రం కృష్ణా జలాలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. 

కుప్పం నియోజకవర్గ ప్రజలకు 2022, సెప్టెంబరు 23న ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ–నీవా కాలువల మీదుగా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా ఇప్పటికే కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలానికి చేరుకున్నాయి. కృష్ణమ్మ స్పర్శతో దుర్భిక్ష కుప్పం పరవశించిపోతోంది. 

కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌లో 68.466 కిమీ వద్ద క్రాస్‌ రెగ్యులేటర్‌ (రామకుప్పం మండలం రాజుపాలెం వద్ద) నుంచి మద్దికుంటచెరువు (2.91 ఎంసీఎఫ్‌టీ), నాగసముద్రం చెరువు (0.25 ఎంసీఎఫ్‌టీ), మనేంద్రం చెరువు (13.78 ఎంసీఎఫ్‌టీ), తొట్లచెరువు (33.02 ఎంసీఎప్‌టీ)లకు సోమవారం సీఎం వైయ‌స్‌ జగన్‌ కృష్ణాజలాలను విడుదల చేసి, జాతికి అంకితం చేయనున్నారు. ఆ తర్వాత మిగతా 106 చెరువులకు కృష్ణాజలాలను విడుదల చేసి.. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందించనున్నారు. ఇచ్చిన మాటను నిలబె­ట్టుకున్న సీఎం వైయ‌స్ జగన్‌ తమకు సాగు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారని ఆ నియోజక­వర్గ ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. 

Back to Top