రేపు ఢిల్లీకి వెళ్ల‌నున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్తున్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆయన ఢిల్లీకి వెళ్తారు. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర‌ హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర‌ జలవనరుల శాఖమంత్రి గజేంద్ర సింగ్‌షెకావత్‌ సహా పలువురు కేంద్రమంత్రులతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భేటీకానున్నారు. పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వారితో చర్చిస్తారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top