విశాఖలో జననేతకు ఘనస్వాగతం

సీఎంకు కృతజ్ఞతలు చెప్పేందుకు భారీగా తరలివచ్చిన జనం

విశాఖపట్నం: విశాఖ ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు వైయస్‌ఆర్‌ సీపీ శ్రేణులు, ఉత్తరాంధ్ర వాసులు ఘనస్వాగతం పలికారు. పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సీఎంను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. సీఎం స్వాగతం పలికేందుకు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనం విశాఖకు తరలివచ్చారు. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ప్రతిపాదించిన తరువాత మొదటిసారి విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి కృతజ్ఞతాపూర్వకంగా జనమంతా స్వాగతం పలికారు. జై జగన్‌ నినాదంతో విశాఖ ప్రాంతం మార్మోగింది. ఎయిర్‌పోర్టు నుంచి తాటిచెట్లపాలెం – సిరిపురం మీదుగా కైలాసగిరి, అక్కడి నుంచి సెంట్రల్‌ పార్కు, అక్కడి నుంచి ఆర్కే బీచ్‌ వరకు 24 కిలోమీటర్లు మేర రహదారిపై మానవహారంగా నిల్చొని సీఎంకు కృతజ్ఞతలు తెలపనున్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ విశాఖలో రూ.1,290 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం విశాఖ ఉత్సవ్‌ను సీఎం ప్రారంభిస్తారు. 
 

Back to Top