పేదలందరికీ ఇళ్లు అందిస్తున్నాం

రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల ఇళ్ల పట్టాలు అందిస్తున్నాం

మహిళా సాధికారతకు పెద్దవేట వేస్తూ అక్కచెల్లెమ్మల పేరిటే రిజిస్ట్రేషన్‌

16,098 ఈడబ్ల్యూఎస్‌ కాలనీలను అభివృద్ధి చేస్తున్నాం

ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

తాడేపల్లి: పేదలందరికీ ఇళ్లు నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగానే రాష్ట్రంలో 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాతలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైయస్‌ జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ముందుగా దేశ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 

ఏపీలో 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందజేస్తున్నామని వివరించారు. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం 68,677 ఎకరాల భూమి సేకరించామని, అందులో 25,433 ప్రభుత్వ భూమి ఉందన్నారు. సేకరించిన భూమిలో లేఅవుట్లు తయారు చేసి అర్హులైన పేదలకు ప్లాట్లు అందిస్తున్నామన్నారు. 16,098 ఈడబ్ల్యూఎస్‌ కాలనీలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. 2022లోపే ఈ ఇళ్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. మహిళా లబ్ధిదారుల పేరిట ఇళ్లు రిజిస్ట్రేషన్‌ చేస్తున్నామని, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం అమలు చేస్తున్నామన్నారు. కాలనీల్లో నీరు, విద్యుత్‌ సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. పీఎంఏవై అర్బన్‌ కింద ఏపీకి 20.21 లక్షల ఇళ్లు కేటాయించారు. పేదలందరికీ ఇళ్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోడీకి వివరించారు.
 

Back to Top