27న అమ్మ ఒడి మూడో విడత పంపిణీ 

ఆమదాలవలస– శ్రీకాకుళం రోడ్డు నాలుగు లైన్ల విస్తరణ పనులకు శంకుస్థాపన

శ్రీ‌కాకుళం జిల్లాలో సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష‌

 శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27న శ్రీకాకుళం రాను న్నారు. అమ్మఒడి పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే సీఎం చేపట్టనున్నా రు. ఇదే సందర్భంలో శ్రీకాకుళం–ఆమదాలవలస రోడ్డు నాలుగు లైన్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన కోసం ఏర్పాట్లు సమీక్షించేందుకు సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ మంగళవారం శ్రీకాకుళం వచ్చారు. వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి కోడి రామ్మూర్తి స్టేడియం, ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణాలను పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు.  

సీఎం పర్యటన సాగేదిలా.. 
ఈ నెల 27న సోమవారం ఉదయం 11 గంటల కు శ్రీకాకుళంలో బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి అమ్మ ఒడి లబ్ధిదారులు హాజరు కానున్నారు. మూడో విడత పంపిణీ కార్యక్రమం ఇక్కడి నుంచే జరుగుతుంది. అంతకుముందు ఆమదాలవలస–శ్రీకాకుళం రోడ్డు నాలుగు లైన్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అమ్మ ఒడి లబ్ధిదారులతో మమేకమవుతారు. తిత్లీ, వంశధార ప్రాజెక్టుకు అదనపు పరిహారం పొందుతున్న లబ్ధిదారులతో కూడా కాసేపు ముచ్చటిస్తారు. ఈ సందర్భంగా ఆ లబ్ధిదారులు సీఎంకు ధన్యవాదాలు తెలియజేయనున్నారు. 

Back to Top