స్వర్నిమ్‌ విజయ్‌ వర్ష్‌ కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌

 మాజీ సైనికులకు ఘన సన్మానం  

తిరుపతి:  తిరుపతి స్వర్నిమ్‌ విజయ్‌ వర్ష్‌ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పెరేడ్‌ గ్రౌండ్‌ చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌ మొదట మాజీ సైనికులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం అమరవీరుల జ్యోతిని వెలిగించారు. సైనికుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించిన సీఎం వైయస్‌ జగన్‌ వారిని అభినందించారు. చివరగా మాజీ సైనికులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, గౌతంరెడ్డి, టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి, ఎంపీ బాలశౌరీ, రెడ్డప్ప, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 
 

Back to Top