సీఎం వైయ‌స్ జగన్‌ తిరుమల పర్యటన ఖరారు

తిరుమల: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 23న విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి సాయంత్రం 3.50 గంటలకు సీఎం వైయ‌స్ జగన్‌ చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5 గంటలకు తిరుమలలోని పద్మావతి గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. సాయంత్రం గం. 6.20 నిమిషాలకు గరుడ వాహనం సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 24న ఉదయం గం. 8.10 నిమిషాలకు కర్ణాటక ముఖ్యమంత్రి యాడ్యూరప్పతో కలిసి కర్ణాటక సత్రాల నూతన భవన నిర్మాణ భూమి పూజలో వైయ‌స్‌ జగన్ పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం గం.11.30 కు తిరుమల నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top