సున్నా వడ్డీపై చంద్రబాబు అబద్ధాలు ప్రచారం 

టీడీపీ సున్నా వడ్డీ పథకంపై పక్కా ఆధారాలున్నాయి..

సభను చంద్రబాబు తప్పుతోవ పట్టిస్తున్నారన్నారు

సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

అమరావతిః సున్నా వడ్డీ పథకాన్ని జాతీయ స్థాయిలో గొప్పగా అమలు చేసినట్లు చంద్రబాబు చెబుతున్నారని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఐదేళ్లలో సున్నావడ్డీ పథకానికి రూ.11,595 కోట్లు ఇవ్వాల్సిఉంటే రూ.630  కోట్లు  మాత్రమే చంద్రబాబు సర్కార్‌ చెల్లిందన్నారు. సున్నా వడ్డీ పథకం గొప్పగా అమలు చేసినట్లుగా..జాతీయ స్థాయిలో కూడా ఆయనను పొడిగినట్లుగా  చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 2014–15 సంవత్సరంలో వ్యవసాయ రుణాలు రూ.29,658 కోట్లకు గాను చంద్రబాబు ఇచ్చిన వ్యవసాయ రుణాలు రూ.1186 కోట్లు మాత్రమేనని తెలిపారు. వడ్డీ లేని రుణాలు ఇవ్వలేమని చంద్రబాబు సర్కార్‌ చేతులెత్తేసిందన్నారు.2014–15 ఏడాదికి 29,659 కోట్ల క్రాప్‌ లోన్లు ఉన్నాయన్నారు.

సున్నా వడ్డీ పథకానికి రూ.1186 కోట్లు కడితేనే రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తారని.. చంద్రబాబు ప్రభుత్వం రూ.43.31 కోట్లు  మాత్రమే కట్టిందన్నారు.2015–16 సంవత్సరానికి గాను ఏడాదికి 2,283 కోట్లు కట్టాల్సిన పరిస్థితుల్లో రైతులకు ఇచ్చింది రూ.31 కోట్లు మాత్రమే చంద్రబాబు సర్కార్‌ కట్టిందన్నారు.2016–17లో సున్నావడ్డీ పథ«కానికి 2,354 కోట్లు కట్టాల్సిన పరిస్థితుల్లో  రైతులకు ఇచ్చింది  రూ.249 కోట్లు మాత్రమే కట్టిందన్నారు.2017–18 సున్నావడ్డీ పథకానికి 2,703 కోట్లు కట్టాల్సిన పరిస్థితుల్లో  రైతులకు ఇచ్చింది రూ.182  కోట్లు మాత్రమే క ట్టిందన్నారు.

2018–19 సున్నావడ్డీ పథకానికి రూ.3,069 కోట్లు కట్టాల్సిన పరిస్థితుల్లో రైతులకు ఇచ్చింది రూ.122 కోట్లు మాత్రమే కట్టిందన్నారు. సున్నా వడ్డీకి జవాబు చెప్పలేని బాబు ..సభను తప్పుతోవ పట్టిస్తున్నారన్నారు. టీడీపీ సున్నా వడ్డీ పథకంపై పక్కా ఆధారాలున్నాయి.సభా సాక్షిగా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సభ్యులను మాట్లాడించే అలవాటు టీడీపీకి ఎప్పుడూ లేదన్నారు.సున్నా వడ్డీ అంటూ బాబు అబద్దాలు ప్రచారం  చేశారన్నారు. సున్నా వడ్డీ పథకంపై టీడీపీ చెప్పాల్సిందంతా చెప్పనీయండి. ఆ తర్వాతే సున్నా పథకంపై మేం వివరణ ఇస్తామన్నారు.
 

Back to Top