వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం

సీఎం వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి

వంగవీటి రంగ, మాధవరెడ్డి హత్యలు చంద్రబాబు హయాంలోనే..

మా చిన్నాన్న హత్య కూడా బాబు హయాంలోనే జరిగింది

మా అమ్మ, చెల్లెలు, చిన్నాన్న గురించి చంద్రబాబే మాట్లాడాడు

చిన్నాన్నను ఎవరైనా ఏమైనా చేసుంటారంటే.. అది టీడీపీ వాళ్లే చేసుండాలి

సంబంధం లేని విషయాలను తీసుకొచ్చి చంద్రబాబు రెచ్చగొట్టారు

దేవుడి దయ, ప్రజల దీవెన ఉన్నంతకాలం ఎల్లో మీడియా ఏమీ చేయలేదు

కుప్పంలోనూ ప్రజలు చంద్రబాబును పూర్తిగా వ్యతిరేకించారు

శాసన మండలిలో కూడా టీడీపీ బలం పడిపోయింది

ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నాం

విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు తోడుగా నిలిచాం

ప్రతి పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలో సెకండరీ ప్రాసెసింగ్‌ యూనిట్‌

అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

అమ‌రావ‌తి:  వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం మహిళలు, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో రైతుల సంక్షేమం కోసం చాలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతున్నామని పేర్కొన్నారు. ఆర్బీకేల ద్వారా వైఎస్సార్‌ యంత్రసేవా పథకం తెచ్చాం. తక్కువ ధరకు పనిముట్లు అద్దెకిచ్చేలా అందుబాటులోకి తెచ్చాం. విత్తు నుంచి కోత వరకు అవసరమైన యంత్ర పరికరాలు అందుబాటులో ఉంచాం. ఆర్బీకేల ద్వారానే ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశాం. ప్రతి పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలో సెకండరీ ప్రాసెసింగ్‌ యూనిట్‌ తెస్తున్నాం. ఆర్బీకేల పరిధిలోనే గోడౌన్స్‌, కోల్‌రూమ్స్‌ ఏర్పాటు చేశాం. రూ.3వేల కోట్ల నిధులతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని సీఎం వైయ‌స్‌ జగన్‌ అన్నారు. వ్య‌వ‌సాయ రంగంపై జ‌రిగిన చర్చ‌లో ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాట్లాడారు. ముఖ్య‌మంత్రి ఏమ‌న్నారంటే..వైయ‌స్ జ‌గ‌న్ మాట‌ల్లోనే..

రైతులకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు, మరోవైపు వర్షం వల్ల అనేక ప్రాంతాలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్షం సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి. ఫలాని మాదిరిగా చేయవచ్చు అని సలహాలు ఇవ్వాలి. ప్రజలు ఎలా పోయినా నాకు అభ్యంతరం లేదు. నా అజెండా పొలిటికల్‌ ఎజెండా అంటూ ప్రతిపక్ష నేత వ్యవహరించారు. చంద్రబాబు తీరు, ఆయన డ్రామా అన్ని కూడా మన కళ్లేదుటే కనిపించాయి. నేను ఇక్కడ లేను కలెక్టర్ల రివ్యూలో ఉన్నాను. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశాను. 

చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో ఉన్నారని అందరికీ తెలుసు. ప్రజలు చంద్రబాబు మీద వ్యతిరేకత అన్నది బాహటంగా చూపించారు. ప్రజల వ్యతిరేకతను ఆయన చూశారు.  ఈ రోజు కౌన్సిల్‌లో కూడా వారి బలం పూర్తిగా మారిపోయింది. వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీల బలం పెరగడం..ఈ రోజు చైర్మన్‌గా వైయస్‌ఆర్‌సీపీకి చెందిన నా సోదరుడు, దళితుడు మోషన్‌ రాజు కుర్చీ ఎక్కుతున్నాడు. ఇవన్నీ కూడా తట్టుకోలేని ప్రెస్టేషన్‌లో చంద్రబాబు ఉన్నాడు. సంబంధం లేకుండా ఆయనే మాట్లాడుతారు. మాట్లాడే సమయంలో స్పందన ఇటు నుంచి కూడా ఉంటుంది. 
మా వాళ్లు ప్రత్యారోపణలుగా మీ హాయంలో జరిగిన వంగవీటి మోహన్‌రంగా, మాధవరావు హత్యా,  మల్లెల్ల బాబ్జీ తాను చనిపోతు రాసిన లేఖలో రాసింది చెప్పారు. ఎక్కడా కూడా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడలేదు. మా చినాన్న, అమ్మ, చెల్లి గురించి చంద్రబాబే మాట్లాడారు. అలాంటిది ఆయనే విపరీతంగా స్పందించారు. ఓవర్‌ రియాక్ట్‌ అయి తానేం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాలేదు. సభ నుంచి వెళ్లిపోతు శపథాలు చేశారు.

పై నుంచి దేవుడు చూస్తుంటారు. దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలే ముఖ్యం. మంచి చేసినంత కాలం దేవుడు ఆశీర్వదిస్తారు. ప్రజలు దీవిస్తారు. నాకు ఈనాడు లాంటి పెద్ద సంస్థ తోడుగా ఉండకపోవచ్చు. ఏబీఎన్, టీవీ5 నాకు ఉండకపోవచ్చు. వీళ్లు ఆబద్ధాలను నిజం చేసేందుకు ప్రయత్నం చేసే మేధావులు, గోబెల్స్‌ ప్రచారంలో వీళ్లు దిట్టలు. అబద్ధపు రాతలు, టీవీల్లో చూపిస్తారు. కానీ నిజాన్ని మాత్రం దాచలేరు. ప్రజలకు మంచి జరిగేది దాచలేరు. చంద్రబాబు ఎన్ని డ్రామాలు చేసినా, కళ్లలో నుంచి నీళ్లు తిరగకపోయినా తిరిగినట్లు డ్రామాలు చేయవచ్చు. ఆయనే డ్రామా చేస్తాడు. ఆయనే మాట్లాడుతాడు. దేవుడి దయ, ప్రజల దీవెనలు ఉన్నంత కాలం ఈనాడు, ఆంధ్రజ్యోత, టీవీ5లు ఏమీ చేయలేవు. చివరకు మంచే గెలుస్తుంది.

 మా చిన్నాన్న గురించి మాట్లాడుతున్నారు. మానాన్న తమ్ముడు ఆయన. అవినాష్‌రెడ్డి మరో చినాన్న కొడుకు. ఒక కన్ను మరొ కన్నును ఎందుకు పొడుస్తుంది. ఇవన్నీ జరిగింది చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే. మా చినాన్నను ఓడించేందుకు చంద్రబాబు కుట్రలు చేశారు. మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను ప్రలోభాలు పెట్టి అక్కడ ఎమ్మెల్సీ సీటు కోసం మా చినాన్నను ఓడించారు. అంతటి దారుణంగా వ్యవహరించారు. మా చినాన్నను వాళ్లే ఏమైనా చేసి ఉండాలి. చివరకు మభ్యపెట్టే కార్యక్రమాలు, మా కుటుంబంలోనే చిచ్చు పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. రాజకీయంగా మాట్లాడుతున్నారు. దురదృష్టకరం.

రైతుల గురించి మాట్లాడుతున్నాం. మన రాష్ట్రంలో ఈ రెండున్నరేళ్లుగా రైతులకు మంచి జరిగింది. ఎలా చేయగలిగామన్నది మంత్రి కన్నబాబు సుదీర్ఘంగా చెప్పారు. మా ప్రభుత్వం నమ్మేది. తాను నమ్మేది..రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనసా వాచా కర్మణా నమ్ముతాను. 
రైతు పక్షపాత ప్రభుత్వం మాది. రైతు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి. రైతులు, రైతు కూలీలు బాగుంటారు. ఇవన్నీ జరిగితేనే గ్రామీణ ఎకానమీ బాగుటుంది. ఈ రంగంలో ఎవరూ ఆలోచన చేయని విధంగా విప్లవాత్మక మార్పులు తెచ్చాం. అందుకే ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం. రైతులకు ఏం చేస్తే బాగుపడుతారని కళ్లారా పాదయాత్రలో చూపి అవే అంశాలను మేనిఫెస్టోలో చెప్పాం. ప్రతి పాయింట్‌ను వందకు వంద శాతం అమలు చేస్తున్నాం. వాగ్దానాలు అన్ని కూడా అమలు చేస్తున్నాం.

గత ప్రభుత్వంలో అటు మహిళలకు ఇచ్చిన వాగ్ధానాలు, రైతులకు ఇచ్చిన హామీలు గానీ ఏ ఒక్కటి కూడా చంద్రబాబు అమలు చేయలేదు. ఎలా ఎగ్గొట్టాలని చంద్రబాబు పని చేశారు. ప్రతి ఒక్క వాగ్ధానాన్ని కూడా ఎలా అమలు చేయాలని చిత్తశుద్ధితో అడుగులు ముందుకు వేశాం. గత ప్రభుత్వం రైతులకు సంబంధించి రూ.87612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని మాట ఇచ్చిన ఈ పెద్ద మనిషి చివరకు రైతులకు ఒకసారి మాఫీ చేస్తానని చెప్పారు. మాఫీ కథ దేవుడెరుగు, సున్నా వడ్డీ కట్టడం కూడా మానేశారు. కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే విడతల వారిగా అందించారు.

మన ప్రభుత్వం ఈ రెండున్నరేళ్ల పాలనలో చేసిన మేలులు గుర్తు చేసుకుంటే..ఒక్క వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం గురించి మాట్లాడాల్సి వస్తే..అక్షరాల రూ.18,777 కోట్లు రైతులకు అందించాం. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులతో పాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులు, అటవీ భూములు సాగు చేసుకుంటున్న ఆర్‌వోఎఫ్‌ పట్టాలు ఉన్న సాగుదారులందరికీ కూడా ప్రతి ఏటా రూ.13500 చొప్పున రైతు భరోసా అందజేస్తున్నాం. 
ఎన్నికలప్పుడు చెప్పిన దానికన్న మిన్నగా నాలుగేళ్లు అని చెప్పాం. ఐదేళ్లు ఇస్తున్నాం. రూ.12500 ఇస్తామని రూ.13500 ఇస్తున్నాం. చెప్పిన దానికన్న రూ.17500 ఎక్కువగా ఇస్తున్నాం. ప్రతి సందర్భంలో కూడా రైతును ఎలా కాపాడాలని అడుగులు ముందుకు వేస్తున్నాం.

గతంలో సున్నా వడ్డీ పథకాన్ని ఎగ్గొటింది. సున్నా వడ్డీ బకాయిలు రూ.1180 కోట్లు ఉన్నాయి. మన ప్రభుత్వం వచ్చాక ౖÐð యస్‌ఆర్‌ సున్నా వడ్డీ కింద అక్షరాల రూ.1674 కోట్లు. గత ప్రభుత్వం పెట్టిన వడ్డీ లేని రుణాల బకాయిలు కూడా మనమే కట్టామని తెలియజేస్తున్నా. రైతులు ఇబ్బంది పడకూడదు. వడ్డీ లేని రుణం ఇస్తే రైతుల్లో మంచి అలవాటు వస్తుంది. సకాలంలో రుణాలు తీసుకోవడం, తిరిగి కట్టడం వల్ల సున్నా వడ్డీకే రుణాలు వస్తాయని అలవాటు చేశాం. 
పారదర్శకంగా వ్యవసాయం చేసే ప్రతి రైతుకు కూడా ఈ–క్రాప్‌ నమోదు చేయించి, ప్రతి రైతుకు కూడా సున్నా వడ్డీ పథకం అమలు చేస్తున్నాం. గతంలో మాదిరిగా కొందరికి మాత్రమే అందే విధంగా కాకుండా ఏకంగా ఈ–క్రాప్‌ చేసి ప్రతి రైతుకు కూడా, ప్రతి ఎకరాకు కూడా రైతులు కట్టాల్సిన పని లేకుండా సచివాలయాల్లో జాబితాను ఏర్పాటు చేసి పంటల బీమాను ఏ సీజన్‌కు సంబం«ధించింది అదే సీజన్‌లో అందించి ప్రతి రైతుకు మంచి చేస్తున్నాం.

ఇన్‌ఫుట్‌ సబ్సిడీగా రూ.1070 కోట్లు ఇచ్చాం. ఇందులో ఎప్పుడు జరగని విధంగా రైతులకు మంచి చేసేందుకు ఏ సీజన్‌లో జరిగే పంట నష్టాన్ని ఆ సీజన్‌ ముగిసేలోగా పరిహారం ఇచ్చాం. సెప్టెంబర్‌లో జరిగిన గులాబ్‌ తుపాన్‌లో జరిగిన నష్టాన్ని ఇటీవలే అందజేశాం. విప్లవాత్మక మార్పులు తెచ్చాం. రైతులకు పగటి పూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ఇచ్చాం. రూ.18 వేల కోట్లు ఖర్చు చేశాం.  ఫీడర్లు అప్‌గ్రేడ్‌ చేసేందుకు రూ.1700 కోట్లు ఖర్చు చేశాం.

ఆక్వా రైతులకు గతంలో మాదిరిగా కాకుండా వారిని ఆదుకునేందుకు కరెంటును రూ.1.50కు యూనిట్‌ అందజేస్తున్నాం. ఇందుకోసం రూ.1100 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గొప్ప మార్పులు చిత్తశుద్ధితో చేస్తున్నాం. వ్యవసాయ రంగంలో మరో మార్పు ఏంటంటే రైతు భరోసా కేంద్రాలు. ఇది గొప్ప విప్లవంగా జరుగుతోంది. 
రైతు ఎప్పుడు కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు. మార్కెట్‌ మాయాజాలంలో ఎక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నాడు. రైతు అమ్మే సమయంలో హోల్‌సేల్‌ రేటుకు అతి తక్కువ ధరకు అమ్ముకుంటున్నాడు. ఈ పరిస్థితి మారినప్పుడే రైతు బాగుపడుతారని ఆలోచన చేశాం. అందుకే ప్రతి పంచాయతీలో ఆర్‌బీకేలు ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో ఈ రోజు 10,778 రైతు భరోసా కేంద్రాలను గ్రామ స్థాయిలో కనిపిస్తున్నాయి.
 విత్తనం నుంచి విక్రయం దాకా ఆర్‌బీకేలు రైతుకు తోడుగా ఉంటున్నాయి. పంట కొనుగోలు, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, పంటల బీమా అన్నీ కూడా రైతుకు లభించేలా ప్రతి ఒక్కటీ కూడా డూప్లికేషన్‌కు, లంచాలకు తావే లేకుండా ఈ–క్రాపింగ్‌ తీసుకువచ్చాం. ఏ రైతు ఎన్ని ఎకరాలు వేస్తున్నాడు. ఎన్ని పంటలు వేస్తున్నాడని ఫిజికల్‌ అక్నాలేజ్‌మెంట్‌ ఇస్తున్నాం. ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకమైనా కూడా గ్రామస్థాయిలో జాబితాను ప్రదర్శిస్తున్నాం. అంత పారదర్శకంగా జరుగుతుంది. 
ఈ–క్రాపింగ్‌ ద్వారా ఈ రోజు 108 లక్షల ఎకరాల్లో 93.22 లక్షల ఫిజికల్, డిజిటల్‌ అక్నాలెజ్‌మెంట్‌లో జనరేట్‌ చేసి రైతులకు ఇచ్చాం.ఆర్‌బీకేలకు అనుసంధానంగా వైయస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం కూడా తీసుకువచ్చాం. చిన్నా సన్నకారు రైతులకు తక్కువ ధరకు అద్దెకు సాగు యంత్రాలు, పని ముట్లు అందుబాటులో ఉంచాం. సీహెచ్‌సీల ద్వారా విత్తు నుంచి కోత వరకు అవవసరమైన పరికరాలు అన్నీ కూడా అందుబాటులో ఉంచాం. రూ.2134 కోట్లు ఖర్చు చేస్తూ యంత్రాలను ఆర్‌బీకేల్లో ఏర్పాటు చేశాం. 

గతంలో ఎప్పుడు జరగని విధంగా ధాన్య సేకరణ కొనుగోలు కూడా పారదర్శకంగా చేస్తున్నాం. ఆర్‌బీకే స్థాయిలోనే ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. కొనుగోలు అయిపోయిన తరువాతే మిల్లరు రావాలి. మద్దతు ధర రైతుకు అందాలి. ఎలాంటి మోసాలు జరగకూడదని ఆదేశాలు ఇచ్చాం. మంత్రులు కూడా ఇందు కోసం పూర్తిగా నిమగ్నమయ్యారు. ధాన్యం సేకరణ రెండేళ్ల కాలంలో అక్షరాల 35 వేల కోట్లు ఖర్చు చేశాం. ఎప్పుడు ఇలా జరగలేదు. గతంలో ధాన్యం సేకరణకు ఏడాదికి రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తే..ఈ రోజు రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. 

పత్తి కొనుగోలుకు మరో రూ.1800 కోట్లు ఖర్చు. ఇతర పంటల కొనుగోలుకు రూ.6400 కోట్లు ఖర్చు చేశామని గర్వంగా చెబుతున్నాం. ఎంఎస్‌పీ లేని పంటలు దాదాపుగా 7 పంటలను రాష్ట్ర ప్రభుత్వమే గిట్టుబాటు ధర ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. 

నాడు –నేడు కార్యక్రమం స్కూళ్లు, వైద్య రంగమే కాకుండా మార్కెట్‌యార్డులను కూడా తీసుకువచ్చాం. ప్రతి ఆర్‌బీకే పరిధిలో అక్కడే గోడౌన్లు, కోల్డు స్టోరేజీలు, ప్రైమరీ ప్రాసెసింగ్, అసైన్‌ ఎక్విమెంట్లు గ్రామస్థాయిలోకి తీసుకువస్తున్నాం. మరో మూడేళ్లలో ప్రతి పార్లమెంట్‌లోనూ సెకండరీ ప్రాసెసింగ్‌ యూనిట్లు తెస్తాం. గ్రామస్థాయిలోనే పోటీపడి పంట కొనుగోళ్లు జరుగుతాయి. ఏ రైతు పంట అమ్ముకోలేని పరిస్థితి ఉండకూడదు. ఆర్‌బీకే పరిధిలో ప్రభుత్వమే పంటను కొనుగోలు చేస్తుంది. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం.

రైతు ఎక్కడా ఇబ్బంది పడకూడదని రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైఫరిత్యాల నిధి ఏర్పాటు చేశాం. రైతులే ఒక కమిటీగా ఏర్పాటై గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి వ్యవసాయ సలహా కమిటీలు ఏర్పాటు అయ్యాయి. ప్రతి నెల గ్రామస్థాయిలో మొదటి శుక్రవారం, రెండో శుక్రవారం మండల స్థాయి, మూడో శుక్రవారం జిల్లా స్థాయిలో, నాలుగో శుక్రవారం రాష్ట్రస్థాయిలో సమావేశం జరుగుతుంది. రైతుల సమస్యలు జిల్లా స్థాయిలో కలెక్టర్లు పరిష్కరిస్తారు. ప్రతి సమస్య కూడా పరిష్కరించాలనే ఆరాటంతో ఉన్నాం. 

గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టి ఎగ్గొట్టిన ధాన్యం సేకరణ బకాయలు రూ. 960 కోట్లు, రూ.9 వేల కోట్ల విద్యుత్‌ బకాయిలు,  రూ.384 కోట్ల విత్తన బకాయిలను మన ప్రభుత్వమే చిరునవ్వుతో భరించింది. 

కాసేపటి క్రితం అమూల్‌ సంస్థ గురించి..అది సహకార రంగంలో విప్లవం. ఇందులో పాలు పోసే వారే భాగస్వాములు. అదోక ఉద్యమం. దేశంలోనే అతిపెద్ద సంస్థ ఈ రోజు ఏపీకి రావడం వల్ల ఇంతకు ముందు పాలు పోసే సమయంలో మోసాలు ఉండేవి. అవన్నీ కూడా ఈ రోజుపోయాయి. గ్రామస్థాయిలోనే బల్క్‌మిల్క్‌ యూనిట్లు వచ్చాయి. టెస్టింగ్‌ జరగడం వల్ల ప్రతి రైతుకు రూ.5 నుంచి రూ.15 అదనంగా వస్తోంది. మిగతా సంస్థలు కూడా పాలు పోసే వారికి ఎక్కువ రేటు ఇవ్వాల్సి వచ్చింది. ఇది కేవలం అమూల్‌ సంస్థ వల్లే జరిగింది. 

దేవుడి దయతో వాతావరణం అనుకూలించి కరువు సీమల్లో కూడా ఈ రోజు నీరుంది. ఈ రెండున్నరేళ్ల కాలంలో నీరు పుష్కలంగా ఉంది. మా డ్యామ్‌లు నిండుగా ఉన్నాయి. డ్యామ్‌లు, రిజర్వాయర్లు ఫుల్‌గా ఉన్నాయి. వర్షాల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. కానీ భూగర్భ జలాలు పెరిగాయి. రెండున్నరేళ్ల కాలంలో ఇటువంటి కరువు సీమల్లో పంటలు బాగా పండిస్తున్నారు. పంట విస్తీర్ణం కూడా పెరిగింది. 

రైతులకు గతంలో కరువులు కాటకాలు తెలుసు. ఈసారి కరోనా కూడా రైతులకు సవాలు విసిరినా కూడా రైతుల పట్ల మరింత బాధ్యతగా అడుగులు ముందుకు వేశాం. చంద్రబాబు పెట్టిన బకాయిలను చెల్లిస్తూనే..మార్కెటింగ్‌పై కూడా దృష్టి పెట్టాం. గత ప్రభుత్వాలు చేయలేమని వదిలేసిన వాటిని కూడా మార్పు చేస్తూ అడుగులు వేస్తున్నాం. పొగాకు కొనుగోలులో ప్రభుత్వం ఎప్పుడు కలుగజేసుకోలేదు. ప్రభుత్వం మార్కెట్‌లో పోటీని క్రియేట్‌ చేసి పొగాకు రైతులను ఆదుకుంది. గతంలో ఎప్పుడు కూడా జరగలేదు.

గతంలో పామాయిల్‌ రేట్లు దారుణంగా ఉండేవి. ప్రభుత్వాలు పట్టించుకునేవి కావు. ఆ రోజు ఇచ్చిన రేట్ల కన్నా ఈరోజు డబుల్‌ రేట్లు పలుకుతోంది. గతంలో రూ.7 వేలు ఉంటే..ఇప్పుడు రూ.19 వేలు రేటు ఉంది. తెలంగాణ వాళ్లు కూడా ఏపీని చూసి రేట్లు పెంచాలని డిమాండు చేస్తున్నారట.

ఈ రోజు ఉదయం రాయలసీమ, నెల్లూరులో కురుస్తున్న వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. భారీ వర్షాల కారణంగా కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడాను. నష్టపోయిన ప్రజలను అన్ని విధాల ఆదుకుంటామని తెలియజేస్తున్నాం. నష్టం జరిగినా కూడా దేవుడి దయతో చేయగలిగిన మంచి చేస్తాం. కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. మానవతాదృక్పథంతో వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశాం. హెలికాప్టర్లకు వాతావరణం అనుకూలంగా లేదు. నేవి హెలికాప్టర్లను అందుబాటులోకి తెచ్చాం. కడప, అనంతపురంకు కేటాయించాం. ఐదు నేవీ హెలికాప్టర్లను మాట్లాడుతున్నాం. వాటిని కూడా రెస్కీ ఆపరేషన్‌లోకి తీసుకువస్తాం.

వర్షం వల్ల కొంత మంది అనుకోకుండా చనిపోయారు. ఆ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం. వెంటనే ఎక్సీగ్రేషియా ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాం. క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనా వేసేందుకు బృందాలను ఏర్పాటు చేశాం. రబీలో విత్తనాలు వేసుకొని వర్షాల వల్ల మొలక శాతం దెబ్బతిన్న వారికి 80 శాతం సబ్సిడీలో విత్తనాలు ఇవ్వమని ఆదేశాలు ఇచ్చాం.
మన విధానంలో భాగంగా ఖరీఫ్‌మొదలు కాకముందే పంట నష్ట పరిహారం జరుగుతుందని మరొక్కసారి తెలియజేస్తున్నా. దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలు ఈ ప్రభుత్వంపై ఉండాలని సీఎం వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 

 

తాజా వీడియోలు

Back to Top