తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ సంక్రాంతి శుభాకాంక్ష‌లు

తాడేపల్లి: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ విశిష్టతను సీఎం వివరించారు. 'మనవైన అచ్చ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు, సొంత గ్రామాలమీద మమకారానికి.. రైతులకు, వ్యవసాయానికి మనమంతా ఇచ్చే గౌరవానికి, తెలుగువారికంటూ ప్రత్యేకమైన కళలకు సంక్రాంతి పండుగ ప్రతీక’ అని సీఎం వైయ‌స్ జగన్‌ అన్నారు. ‘భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని.. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలి' అని ముఖ్య‌మంత్రి  ఆకాక్షించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top